
దుల్కర్ సల్మాన్
పగలు పైకి చూస్తే ఆకాశంలోని చుక్కలు కనపడవు. అదే రాత్రి చూస్తే మెరుస్తుంటాయి. జస్ట్.. టైమ్ డిఫరెన్స్ అంతే. ఈ టైమే దుల్కర్ సల్మాన్ లైఫ్‌లో చాలా మార్పులు తెచ్చిందట. మరి.. ఆ మార్పులకు గల కారణాలు తెలుసుకోవాలంటే కాస్త టైమ్ పడుతుంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా రా. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘వాన్’.
వాన్ అంటే తెలుగులో ఆకాశం అనే అర్థం వస్తుంది. రంజాన్ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాలో దుల్కర్ మల్టిపుల్ రోల్స్‌లో కనిపిస్తారట. అంతేకాదు నలుగురు హీరోయిన్లు ఉండే ఈ సినిమాలో ఆల్రెడీ ఒక హీరోయిన్‌గా నివేథా పేతురాజ్ ఎంపికయ్యారని కోలీవుడ్ టాక్. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. జె. సెల్వకుమార్ నిర్మించనున్న ఈ సినిమాకు జార్జ్ సి. విలియమ్స్ కెమెరా వర్క్ చేయనున్నారు.