తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. కానీ కొందరి దర్శకులకు కూడా కల్ట్ అభిమానులున్నారు. వీళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన సినిమా తీస్తే చాలు దాన్ని రిపీట్స్‌లో చూడొచ్చు. ఆయన పెన్ పవర్ అలాంటిది. కానీ తాజాగా 'గుంటూరు కారం' మూవీతో వచ్చిన గురూజీ.. చాలా డిసప్పాయింట్ చేశాడని మూవీ చూసిన చాలామంది అంటున్నారు. ఇదే టైంలో ఓ విషయంలోనూ త్రివిక్రమ్ పట్టుతప్పుతున్నట్లు అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: న్యూ ఇయర్‌కి థియేటర్లలో రిలీజ్.. ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి)
డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా తీశాడంటే అందులో ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ ఉంటారు. చెప్పాలంటే చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న నటులని తీసుకుని వాళ్లని సరిగా ఉపయోగించుకుంటాడనే పేరుంది. అయితే గత మూడు సినిమాల నుంచి మాత్రం సెకండ్ హీరోయిన్లని సరిగా వాడుకోలేకపోతున్నాడా అనే సందేహం వస్తుంది.
ఫస్ట్ 'గుంటూరు కారం'నే తీసుకుందాం. ఇందులో రాజీ అనే మరదలి పాత్ర కోసం హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. అయితే ఈమెతే ముచ్చటగా మూడంటే మూడు సీన్లు చేయించాడు గురూజీ. ఇంత బ్యూటీఫుల్ హీరోయిన్ మూవీలో ఉన్నప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఆమె ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
(ఇదీ చదవండి: Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ)
ఇక త్రివిక్రమ్ గత రెండు సినిమాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి రిపీటైంది. 'అరవింద సమేత'లో ఈషా రెబ్బాని తీసుకున్నారు. హీరోయిన్ అక్క క్యారెక్టర్ ఇచ్చారు. కానీ నో యూజ్. ఇక 'అల వైకుంఠపురములో' చిత్రంలోనూ నివేదా పేతురాజ్‌ని సెకండ్ హీరోయిన్‌గా చేసింది. కానీ ఏం లాభం ఒకటి రెండు డైలాగ్స్ తప్పితే ఉపయోగం లేకుండా పోయింది.
త్రివిక్రమ్ మూవీలో చేశాం అనే ఆనందం తప్పితే ఈ ముగ్గురు బ్యూటీస్‌కి గుర్తింపు అయితే ఏం రాలేదు. అయితే ఇలాంటి చిన్న చిన్న పాత్రలకు పేరున్న హీరోయిన్లని కాకుండా కాస్త గుర్తింపు ఉన్న తెలుగు అమ్మాయిల్ని తీసుకుంటే సరిపోతుందిగా అని సగటు సిని ప్రేమికుడు అనుకుంటున్నాడు.
(ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment