సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీలీల జంటగా నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఖలేజా తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో మరో నటి మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ మహేశ్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన రియల్ లైఫ్‌లోనూ సూపర్‌స్టారేనని అన్నారు.
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. సెట్‌లో ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. నేను సెట్‌లోకి వచ్చిన మొదటి రోజు కాస్తా టెన్షన్ పడ్డా. ఫస్ట్ షాట్‌లోనే ఆయనతో పని చేశా. అప్పుడు చాలా కంగారుగా అనిపించింది. అప్పుడు వెంటనే మహేశ్‌బాబు.. నో టెన్షన్.. కాస్త సమయం తీసుకోండి. ఏం కాదంటూ చాలా కూల్‌గా మాట్లాడారు' అని తెలిపింది. ఆయనతో కలిసి నటించడం చాలా సరదాగా అనిపించింది. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment