
సురేశ్ గోపీ, శోభన
14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జంటగా నటిస్తున్నారు మలయాళ నటుడు సురేశ్ గోపీ, శోభన. ‘మణిచిత్రతాళే, ఇన్నలే, కమీషనర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో కలసి నటించారు శోభన, సురేష్ గోపీ. 2005లో ‘మక్కళుక్కు’ అనే సినిమాలో చివరిసారి కలసి నటించారు. లేటెస్ట్‌గా అనూప్ సత్యన్ దర్శకత్వంలో ఈ జంట నటిస్తోంది. తొలిరోజు షూటింగ్‌లో తీసిన ఫొటో ఇది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment