Seetha Ramam: Dulquer Salmaan And Rashmika Mandanna Movie Title Out - Sakshi
Sakshi News home page

Seetha Ramam: దుల్కర్‌ సల్మాన్‌, రష్మిక కొత్త చిత్రం టైటిల్‌ ఇదే

Published Sun, Apr 10 2022 3:10 PM | Last Updated on Sun, Apr 10 2022 3:31 PM

Seetha Ramam: Dulquer Salmaan And Hanu Raghavapudi Movie Title Out - Sakshi

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా ప‌తాకంపై  అశ్విని దత్‌, ప్రియాంక్‌ దత్‌ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో మృణాళిని ఠాకూర్ సీత పాత్ర లో కనిపించనుంది. అఫ్రీన్‌ అనే కశ్మీర్‌కు చెందిన ముస్లిం యువతిగా రష్మిక నటిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని వెల్లడిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు నిర్మాతలు.

ఈ చిత్రానికి ‘సీతారామం’అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. రష్మిక పాత్రలో హనుమాన్‌ షేడ్స్‌ ఉన్నాయి. రామాయణంలో శ్రీరాముడికి ఆంజనేయుడు సహాయం చేసినట్లుగా.. యుద్దంలో మ‌ద్రాస్ ఆర్మీ ఆఫ‌స‌ర్ లెఫ్ట్‌నెంట్ రామ్‌( ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌ పాత్ర పేరు)కు రష్మిక సహాయం చేస్తుంది. ఇది ఓ సైనికుడు శత్రువుకు అప్పగించిన యుద్దం అఫ్రీన్‌.. ఈ యుద్దంలో సీతారాములను నువ్వే గెలిపించాలి’అనే సుమంత్‌ వాయిస్‌ ఓవర్‌ ప్రారంభమైన ఈ స్పెషల్‌ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండగా దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement