'కొడుకు నుంచి మమ్ముట్టి నటన నేర్చుకోవాలి'
ఎవరినైనా పొగడాలంటే.. అవతలివాళ్లను తిట్టాలన్నది రాంగోపాల్ వర్మ ఫిలాసఫీ. తాజాగా ప్రముఖ మళయాళ నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ను ప్రశంసల్లో ముంచెత్తడానికి స్వయంగా మమ్ముట్టినే తిట్టిపోశాడు రామూ. మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన 'ఓకే బంగారం' సినిమాను ప్రశంసించేందుకు తన ట్విట్టర్ ఖాతాను వేదికగా చేసుకున్నాడు.
ఇప్పుడే తాను మణిరత్నం సినిమా చూశానని, అవార్డు కమిటీ సభ్యులకు ఏమాత్రం సెన్స్ ఉన్నా.. వాళ్లు మమ్ముట్టికి ఇన్నాళ్లుగా ఇచ్చిన అవార్డులన్నీ వెనక్కి తీసేసుకుని వాటిని ఆయన కొడుక్కి ఇస్తారని రామూ అన్నాడు. దుల్కర్తో పోలిస్తే మమ్ముట్టి ఒక జూనియర్ ఆర్టిస్టు మాత్రమేనని వ్యాఖ్యానించాడు. మమ్ముట్టి నటనను తన కొడుకు నుంచి నేర్చుకోవాలని.. తాను ఈ మాట నిజంగానే అంటున్నానని నొక్క చెప్పాడు. కొన్నేళ్లలోనే మమ్ముట్టి కొడుకు కేరళ గర్వపడేలా చేస్తాడని.. ఇన్ని దశాబ్దాలుగా మమ్ముట్టి మాత్రం ఆ పని చేయలేకపోయారని కూడా రాంగోపాల్ వర్మ అన్నాడు.
Jst saw Mani's film and if the award commitee members have any sense they will take back all awards of Mamooty and give it to his son
— Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015
Mamooty is a junior artiste compared to his son
— Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015
Mamooty should learn acting from his son..I mean realistic
— Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015
Mamootys son will make Kerala proud In the non Kerala markets in just years which Mamooty couldn't do for decades
— Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015