
దుల్కర్ సల్మాన్
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్. ‘‘స్టార్ కొడుకు కాబట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఈజీగానే వచ్చేసింది. కావల్సి వస్తే తండ్రే స్వయంగా కొడుకు సినిమాను ప్రమోట్ చేస్తారు’’ అని కూడా చాలామంది అనుకుంటారు. కానీ తనయుడు సినిమాలని తండ్రి ఎప్పుడూ ప్రమోట్ చేయరట. బాలీవుడ్‌కు ‘కార్వాన్’ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు దుల్కర్. ఈ సినిమాను మమ్ముట్టి కూడా ప్రమోట్ చేయనున్నారు అనే వార్తలు వచ్చాయి. దానికి దుల్కర్ స్పందిస్తూ– ‘‘మా నాన్నగారు ఇప్పటివరకూ నన్ను కానీ, నా సినిమాలని కానీ ప్రమోట్ చేయలేదు. ఈ విషయంలో ఎప్పటికీ మార్పు ఉండకపోవచ్చు’’ అని పేర్కొన్నారు. ఎవరి టాలెంట్‌తో వాళ్లు పైకి ఎదగాలి అన్నది ముమ్ముట్టి అభిప్రాయం అయ్యుండొచ్చు. తండ్రి అనుకున్నట్లుగానే తన ప్రతిభతోనే దుల్కర్ సౌత్ స్టేట్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తన లక్‌ని టెస్ట్ చేసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment