
జుడా, అల్లు శిరీష్
దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ చిత్రం ఏబిసిడి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) చిత్రం తెలుగు రీమేక్‌లో అల్లు శిరీష్ నటిస్తున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు సంజయ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర’ శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీని తీసుకున్నట్టు చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ‘ఆపరేషన్ అలిమేలమ్మ, చమక్’ వంటి కన్నడ సూపర్ హిట్ సినిమాలకు సంగీతం సమకూర్చారు జుడా స్యాండీ. ‘‘ఏబిసిడికు జుడా స్యాండీను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాం. కన్నడలో యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. వెల్కమ్ టూ టాలీవుడ్ బ్రో’’ అంటూ స్యాండీను టాలీవుడ్‌కు వెల్కమ్ చేశారు శిరీష్. ‘‘తెలుగు సినిమాలో పార్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా, చాలా గౌరవంగా కూడా ఉంది’’ అని పేర్కొన్నారు జుడా స్యాండీ.
Comments
Please login to add a commentAdd a comment