ఒకే తెరపై ముగ్గురు ముద్దుగుమ్మలు
ముంబయి: ఒకే సినిమాలో తెరపై ముగ్గురు బాలీవుడ్ ముద్దుగుమ్మలు సందడి చేయనున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్ కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఏక్తా కపూర్, రేఖ కపూర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన 'వీరే ది వెడ్డింగ్' అనే చిత్రంలో వీరంతా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
నటి సోనమ్ కపూర్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. 'వీరే ది వెడ్డింగ్ అనేది నా తదుపరి చిత్రం. రేఖా కపూర్, కరీనా కపూర్, స్వర భాస్కర్, షికా తాల్సానియా, ఏక్తా కపూర్ ఈ చిత్రంతో గతంలోని సరిహద్దులు చెరిపేయనున్నారు' అంటూ సోనమ్ ట్వీట్ చేసింది. సోనమ్, కరీనా కలిసి నటించడం ఇదే తొలిసారి. రాంజానా, ప్రేమ్ రతన్ ధన్ పాయే చిత్రంలో ఇప్పటికే స్వర భాస్కర్తో సోనమ్ నటించింది.