
డేటింగ్‌పై నో కామెంట్.. ఫొటోలతో క్లారిటీ!
వెయ్యిమాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటోతో చెప్పొచ్చు అంటారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న నటి సోనం కపూర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ ఆహూజా ఫొటోలు ఇదే చెప్తున్నాయని బాలీవుడ్ జనాలు అంటున్నారు. సోనం కపూర్ స్నేహితురాలి నిశ్చితార్థం ఇటీవల లండన్‌లో జరిగింది. ఈ సందర్భంగా సోనం, ఆనంద్ జంటగా వెళ్లిన ఫొటోలు బయటపడి.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. వారిద్దరూ ఫొటోల్లో కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ప్రేమపక్షులుగా చెప్పబడుతున్న ఈ ఇద్దరి ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేశాయి.
అయితే, బుధవారం ముంబైలో జరిగిన బ్రాండ్ విజన్ సమ్మిట్ 2016లో పాల్గొన్న సోనంను ఆనంద్‌తో బంధం గురించి ప్రశ్నించగా.. నో కామెంట్ అంటూ పేర్కొంది. ‘నా వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడాను. పదేళ్లుగా నేను ఇండస్ట్రిలో ఉన్నాను. నేను ఎప్పడు నా జీవితం గురించి చెప్పలేదు. నేనెప్పుడు అలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో రానున్న ‘కాఫీ విత్ కరణ్’షోలోనైనా ఆనంద్‌తో డేటింగ్‌పై సోనం నుంచి ఏమైనా వివరాలు రాబడుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.