
సోనం కపూర్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, ముంబయి : పదేళ్లకు పైగా బాలీవుడ్‌లో పలువురు హీరోలతో ఆడిపాడినా ఎవరితో డేటింగ్ చేయని అనిల్‌కపూర్ గారాలపట్టి సోనం కపూర్ దీనిపై నోరువిప్పారు. తెరపై కెమిస్ర్టీని పండించినా తెరవెనుక హీరోలతో తనకు సాన్నిహిత్యం లేదని ఏ హీరోతోనూ తనను ముడిపెట్టి వదంతులు రాకపోవడాన్ని ప్రస్తావించారు. తాను సినిమాల్లో కలిసి నటించిన హీరోలు అప్పట్లో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, దాంతో వారితో చనువుగా మెలిగే స్పేస్ తనకు లభించలేదని చెప్పారు.
గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఢిల్లీ బిజినెస్‌మెన్ ఆనంద్ అహుజాతో సోనం వివాహ వేడుక మే 8న జరగనున్న విషయం తెలిసిందే. వీరి వివాహాన్ని ఇరు కుటుంబాలు అధికారికంగా నిర్ధారించాయి. వివాహం అనంతరం సోనం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచేందుకు వెళతారు. అనంతరం భారత్‌కు తిరిగివచ్చి తాను నటించిన వీరే ది వెడ్డింగ్ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment