బాయ్ఫ్రెండ్ తో హీరోయిన్ మళ్లీ షికార్లు! | Sonam Kapoor arrives to mumbai airport with Anand Ahuja | Sakshi
Sakshi News home page

బాయ్ఫ్రెండ్ తో హీరోయిన్ మళ్లీ షికార్లు!

Published Sat, Dec 10 2016 6:40 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

బాయ్ఫ్రెండ్ తో హీరోయిన్ మళ్లీ షికార్లు!

బాయ్ఫ్రెండ్ తో హీరోయిన్ మళ్లీ షికార్లు!

ముంబై: ప‍్రేమ వ్యవహారాలు బాలీవుడ్ నటీనటులకు కొత్తే కాదు. అనిల్ కపూర్ కూతురిగా ఇండస్ట్రీగా ఎంట్రీ ఇచ్చినా అనతికాలంలోనే తానేంటో నటిగా నిరూపించుకుంది సోనమ్ కపూర్. ఫ్యాషన్ ఐకాన్ గానూ ఆమెకు పేరుంది. నీర్జా బానోతు జీవిత కథాశంతో తీసిన మూవీలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ మధ్యకాలంలో సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే సోనమ్ వార్తల్లో నిలుస్తోంది. బాయ్ ఫ్రెండ్ ఆనంద్‌ ఆహూజాతో ఆమె ప్రమాయణంపై ఎన్నిసార్లు ప్రశ్నించినా నో కామెంట్ అని బదులిస్తుంది. తాజాగా రెండు రోజుల కిందట ఈ ప్రేమ జంట ముంబై విమానాశ్రయంలో కనిపించింది.

అహుజాతో కలిసి లాస్ ఎంజెలిస్ కు వెళ్లిన సోనమ్ అక్కడ కొన్ని రోజులు షికారు చేసి ముంబైకి తిరిగొచ్చిందని బాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. ఈ నెల 13న జరగనున్న ఫెస‍్టివల్ పార్టీకి, కొన్ని ఫ్యాషన్ షోలకు అహుజాతో కలిసి సోనమ్ హాజరుకానున్నట్లు ముంబై స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. రెండు నెలల కిందట తన సోదరడు హర్షవర‍్ధన్ కు ప్రమోట్ చేసే కార్యక‍్రమం కోసం లండన్ వెళ్లినపుడు ఆమె వెంట ఆనంద్ అహుజా ఉన్నారు. అతడితో కలిసి షాపింగ్ చేయడం ఆమెకు అలవాటుగా మారింది. ఎవరైనా ఆనంద్ తో రిలేషన్ గురించి అడిగితే గుడ్ ఫ్రెండ్ అని చెప్పడం అంతకుమంచి ఏమైనా ఉందా అని సూటిగా అడిగితే మాత్రం ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఈ ఫ్యాషన్ బ్యూటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement