సోనమ్‌ బర్త్‌డే.. ఆనంద్‌ ఫన్నీ విషెస్‌ | Anand Ahuja Wish For His Wife Sonam Is Too Cute | Sakshi
Sakshi News home page

సోనమ్‌ బర్త్‌డే.. ఆనంద్‌ ఫన్నీ విషెస్‌

Jun 9 2018 12:54 PM | Updated on Jun 9 2018 3:04 PM

Anand Ahuja Wish For His Wife Sonam Is Too Cute - Sakshi

సోనమ్‌ కపూర్‌- ఆనంద్‌ అహుజా

పుట్టినరోజు పండుగే అందరికీ... మరి అలాంటి ప్రత్యేకమైన రోజున మనకెంతో ప్రియమైన వారితో కలిసి సమయం గడపడమనేది ఒక అందమైన అనుభూతి. ప్రస్తుతం బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ సోనమ్‌ కపూర్‌ కాదు కాదు శ్రీమతి సోనమ్‌ కపూర్‌ అహుజా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈరోజు (శనివారం) 33వ వసంతంలోకి అడుగుపెడుతున్న సోనమ్‌‌.. తన భర్త ఆనంద్‌ అహుజాతో కలిసి లండన్‌లో బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

ఈ సంద్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సోనమ్‌ ఫొటో షేర్‌ చేసిన ఆనంద్‌.. ‘తన పుట్టినరోజున సోనమ్‌ కేక్‌ను ఇలా చూస్తూ ఉంటుంది. తనను ఇలా చూడటం నాకు సరదాగా ఉంటుంది’  అంటూ చేసిన కామెంట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘వీరే ది వెడ్డింగ్‌’  సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేసేందుకు సోదరి రియా కపూర్‌, కరీనా కపూర్‌, అర్జున్‌ కపూర్‌లతో  సోనమ్‌ లండన్‌ వెళ్లారు. భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేయడం కోసం ఆనంద్‌ కూడా లండన్‌ చేరుకున్నారు. అంతేకాకుండా పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు కావడంతో జీవితాంతం గుర్తుండిపోయేలా సర్‌ప్రైజ్‌ కూడా ప్లాన్‌ చేశాడట‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement