Sonam Kapoor Lip Lock With Her Husband Anand Ahuja Pic Goes Viral - Sakshi
Sakshi News home page

లిప్‌లాక్‌తో స్వాగతం పలికిన బాలీవుడ్‌ జంట

Jan 1 2021 2:05 PM | Updated on Jan 1 2021 3:51 PM

Sonam Kapoor, Anand Ahuja Ready To Take On 2021 With Kiss - Sakshi

బాలీవుడ్‌ జంట సోనమ్‌ కపూర్‌, ఆనంద్‌ అహుజా కొత్త ఏడాదికి వినూత్నంగా స్వాగతం పలికారు. తన భర్త ఆనంద్‌ను గాఢంగా ముద్దాడుతున్న ఫొటోను షేర్‌ చేశారు. 2021కు స్వాగతం పలుకుతున్నా.. ఈ ఏడాదంతా స్నేహితులు, ప్రేమ, పని, ప్రయాణాలు, ఆధ్యాత్మిక, ఇలా అన్నింటి మేళవింపుతో నిండనుంది. మరిన్ని మంచి క్షణాలు ఎంజాయ్‌ చేసేందుకు ఎదురు చూస్తున్నాను. గడిచిన వాటి కోసం ఆలోచించడం మానేసి కలిసి పని చేద్దాం.. కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారగా ఆమె అభిమానులు సోనమ్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ జంట లండన్‌లోనే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. (చదవండి: 'ఓసారి నీ భ‌ర్త‌ను చూడు, ఎంత ద‌రిద్రంగా ఉన్నాడో')

ఇదిలా వుంటే సోనమ్‌ కపూర్‌ "ఏకే వర్సెస్‌ ఏకే" అనే నెట్‌ఫ్లిక్స్‌ చిత్రంలో నటించారు. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె తండ్రి అనిల్‌ కపూర్‌‌, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాలో అనిల్‌ కపూర్‌ నిజం అనిల్‌ కపూర్‌లా, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ నిజం అనురాగ్‌ కశ్యప్‌లా నటించారు. ఇరువురు వారి వారి ఒరిజినల్‌ కెరీర్‌ల మీద పంచ్‌లు విసురుకుంటారు. ఒకరినొకరు తిట్టుకుంటారు. కొట్టుకుంటారు. అదంతా నిజంగా జరుగుతున్నట్టుగా కెమెరాలో రికార్డు చేసి అనురాగ్‌ కశ్యప్‌ విడుదల చేసినట్టుగా ఉంటుంది ఈ సినిమా. ఆశ్చర్యం ఏమిటంటే ‘మీ అమ్మాయిని కిడ్నాప్‌ చేశాను’ అని దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ చెప్పినప్పటి నుంచి అంత పెద్ద హీరో అనిల్‌ కపూర్‌ ఒక సగటు తండ్రిలా స్పందిస్తాడు. అరవై ఏళ్ల వయసులో నిజంగా పరిగెత్తి, కిందపడి, ఒక తండ్రి ఎలా ప్రాధేయపడతాడో అలాగే ప్రాధేయపడతాడు. చివరకు సోనమ్‌ కిడ్నాప్‌ ఏమైందనేది సినిమా చూస్తే తెలుస్తుంది. (చదవండి: అనిల్‌ కపూర్‌ కుమార్తె సొనమ్‌ కిడ్నాప్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement