పెళ్లెప్పుడని వాళ్లని అడగరేం? | Sonam Kapoor feels nobody probes Ranveer Singh and Ranbir Kapoor about their marriage | Sakshi
Sakshi News home page

పెళ్లెప్పుడని వాళ్లని అడగరేం?

Published Thu, Jan 18 2018 12:19 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Sonam Kapoor feels nobody probes Ranveer Singh and Ranbir Kapoor about their marriage - Sakshi

సాధారణంగా పెళ్లి కాని కథానాయికలను ‘మీ పెళ్లెప్పుడు?’ అనే ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. ఈ ప్రశ్నకు కొందరు ఓ చిన్ని చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంటారు. మరికొందరు ‘అప్పుడేనా.. అందుకు ఇంకా చాలా టైమ్‌ ఉంది. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల పైనే’ అంటుంటారు. ఇంకొందరు ‘పెళ్లికేంటి తొందర. ఆ టైమ్‌ వచ్చినప్పుడు అందరికీ చెప్పే చేసుకుంటాం’ అని సమాధానం ఇస్తుంటారు. సోనమ్‌ కపూర్‌ అయితే వీటికి భిన్నంగా స్పందిస్తారు. ‘మీ పెళ్లెప్పుడు’ అని ఇటీవల సోనమ్‌ కపూర్‌ని మీడియావారు అడిగారు. ఈ ప్రశ్నకు ఈ బ్యూటీ ఘాటుగా సమాధానమిచ్చారు.

‘‘పెళ్లెప్పుడు అంటూ ఎప్పుడూ హీరోయిన్లనే అడుగుతారెందుకు? ఇదే ప్రశ్నని హీరోలను అడుగుతారా? రణబీర్‌ కపూర్, రణ్‌వీర్‌ సింగ్‌ వంటి వాళ్లను ఎప్పుడైనా ప్రశ్నించారా? మాకూ పర్సనల్‌ లైఫ్‌ ఉండదా? పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాం కదా? పెళ్లి అయినా నర్గీస్, వహీదా రెహమాన్, షర్మిలా ఠాగూర్, డింపుల్‌ కపాడియా, మాధురీ దీక్షిత్, కాజోల్, కరీనా కపూర్‌ వంటి ఎంతో మంది సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తాము ఎవరికీ తక్కువ కాదంటూ నిరూపించుకోలేదా?’’ అంటూ మండిపడ్డారట సోనమ్‌. ఇదిలా ఉంటే.. వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజా, సోనమ్‌ కపూర్‌ ప్రేమలో ఉన్నారనీ, త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారనీ బాలీవుడ్‌ మీడియా కూడై కూస్తోన్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement