బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనమ్ కపూర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తన అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. 'సావరియా' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది సోనమ్. రామ్ మాధవనీ దర్శకత్వంలో వచ్చిన 'నీర్జా' చిత్రంతో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాకు ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో మోస్ట్ గ్లామరస్‌గా కనువిందు చేసే 'సోన'మ్ అందాలు ఓసారి చూసేద్దామా.
సావరియా సినిమాతో బాలీవుడ్‌లో తెరంగ్రేటం చేసిన సోనమ్
అనిల్ కపూర్ వారసురాలైన తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ సంపాదించుకుందీ ముద్దుగుమ్మ
ప్రేమ్ రతన్ ధన్‌పాయో చిత్రంలో రాజకుమారి మైథిలీ దేవిగా అలరించిన సోనమ్
సన, సోంజ్, జిరాఫీ వంటి ముద్దుపేర్లతో ఈ బాలీవుడ్ భామను పిలుస్తారు
తొలి చిత్రం సావరియా, రాంజనా, ఖుబ్సూరత్, చిత్రాలకు 4 అవార్డులను సొంతం చేసుకుంది
సావరియా, ఢిల్లీ-6, ఐ హేట్ లవ్ స్టోరీస్, థ్యాంక్ యూ, నీర్జా సినిమాలకు స్టార్‌డస్ట్ అవార్డ్స్ అందుకుంది
నీర్జా చిత్రంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు 8 అవార‍్డులను సొంతం చేసుకుందీ బ్యూటీ
యో యో హనీ సింగ్ కంపోజ్ చేసిన ధీరే ధీరే సాంగ్‌లో హృతిక్ రోషన్‌తో పాటు కలిసి నటించింది
నాలుగు ఫిలీంఫేర్ అవార్డులను కొల్లగొట్టిందీ సోనమ్
2018లో వ్యాపారవేత్త అయిన ఆనంద్ అహుజను పెళ్లి చేసుకుందీ కపూర్ వారసురాలు
Comments
Please login to add a commentAdd a comment