అందుకే హీరోయిన్లు స్నేహంగా ఉండరట | Actresses cannot be friends due to insecurity: Jacqueline Fernandez | Sakshi
Sakshi News home page

అందుకే హీరోయిన్లు స్నేహంగా ఉండరట

Published Sun, Aug 16 2015 3:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అందుకే హీరోయిన్లు  స్నేహంగా ఉండరట - Sakshi

అందుకే హీరోయిన్లు స్నేహంగా ఉండరట

ముంబై:  కేవలం ఇన్సెక్యూరిటీ కారణంగానే బీ టౌన్ భామలు దూరం దూరంగా ఉంటారంటోంది  హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. అభద్రతా భావం వల్లే  బాలీవుడ్ హీరోయిన్లు స్నేహంగా ఉండరట. అంతేకాదు మీరు అభద్రతగా  ఫీలయితే  ఇంకెవరితోనూ స్నేహితుల్లా కలవరలేని సలహా కూడా ఇస్తోంది.  కానీ తను అలా కాదట.  బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ లాగా తను చాలా కాన్ఫిడెంట్గా ఉంటానని చెబుతోంది. అందుకే తనకు  సోనమ్ అంటే చాలా ఇష్టమని చెబుతోంది.  ఆమె చాలా తెలివైందని,  చాలా ఆత్మ విశ్వాసంతో ఉంటుందని అంది. అందుకే ఆమె  చిన్న వయసులోనే చాలా విజయాలు సాధించిందంటోంది. అందుకే  సోనమ్ ని ఫాలో అయిపోతానంటోంది ఈ బ్రదర్స్ భామ.

ఇప్పటికే శ్రీలంకలో ఒక  హోటల్ను  నడుపుతున్న ఈ  ముప్పయేళ్ల హీరోయిన్ భారత్లో కూడా తన  వ్యాపారాన్ని విస్తరించేందుకు   యోచిస్తోంది.  భారతీయులకు  శ్రీలంక  రుచులను పరిచయం చేయాలనుకుంటోందిట.   అందుకే ముంబైలో  ఒక రెస్టారెంట్నొకదాన్నిఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నానని చెబుతోంది.  భారత్, శ్రీలంక ఆహారపు అలవాట్లు దాదాపు ఒకేలా ఉంటాయని పేర్కొంది. ఒక సారి తన హెటల్ ఫుడ్  తిన్నవారు మళ్లీమళ్లీ రావాల్సిందే అంటోంది. బాలీవుడ్ స్టయిలిష్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న జాక్వెలిన్  దుస్తుల బిజినెస్లోకి మాత్రం రానంటోంది. అది సోనమ్ లైన్ తనది నాది కాదని చమత్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement