Insecurity
-
IMA study: ఆత్మరక్షణకు ఆయుధాలు
దేశంలో మూడింట ఒక వంతు వైద్యులు రాత్రి షిఫ్టుల్లో అభద్రతతో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. దాంతో కొందరైతే ఆత్మరక్షణ కోసం ఆయుధాలను తీసుకెళ్లడం తప్పదన్న భావనకు కూడా వచ్చారట. ఐఎంఏ అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య దేశమంతటా ఆందోళనకు దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి షిఫ్టుల్లో వైద్యుల భద్రతను అంచనా వేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆన్లైన్ సర్వే చేపట్టింది. 3,885 వైద్యుల వ్యక్తిగత ప్రతిస్పందనలతో నిర్వహించిన ఈ సర్వే దేశంలోనే అతి పెద్ద అధ్యయనమని ఐఎంఏ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది 35 ఏళ్లలోపు వారు. 61 శాతం ఇంటర్న్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలున్నారు. కేరళ స్టేట్ ఐఎంఏ రీసెర్చ్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్, ఆయన బృందం రూపొందించిన ఈ సర్వే ఫలితాలను ఐఎంఏ కేరళ మెడికల్ జర్నల్ అక్టోబర్ సంచికలో ప్రచురించనున్నారు. ఈ ఆన్లైన్ సర్వేను గూగుల్ ఫామ్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు పంపారు. 24 గంటల్లో 3,885 స్పందనలు వచ్చాయని డాక్టర్ జయదేవన్ తెలిపారు. ‘‘వీరిలో చాలామంది దేశవ్యాప్తంగా వైద్యులు, ముఖ్యంగా మహిళలు రాత్రి షిఫ్టుల్లో అరక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో భద్రతా సిబ్బంది, పరికరాలను మెరుగుపరచాల్సిన అవసరముంది’’ అని అధ్యయనం పేర్కొంది.అధ్యయన నివేదిక...కొన్ని ఎంబీబీఎస్ కోర్సుల్లో లింగ నిష్పత్తికి అనుగుణంగా మహిళలు 63 శాతం ఉన్నారు. తమకు భద్రత లేదని భావించే వారి నిష్పత్తి మహిళల్లో ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. 20–30 ఏళ్ల వయస్సున్న వైద్యులు అతి తక్కువ భద్రతా భావాన్ని కలిగి ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఇంటర్న్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. నైట్ షిఫ్టుల్లో 45 శాతం మందికి డ్యూటీ రూమ్ కూడా అందుబాటులో లేదు. రద్దీ, ప్రైవసీ లేకపోవడం, డ్యూటీ గదులకు తాళాలు లేకపోవడమే గాక అవి సరిపోవడం లేదు. దాంతో వైద్యులు ప్రత్యామ్నాయ విశ్రాంతి ప్రాంతాలను వెదుక్కోవాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న డ్యూటీ గదుల్లో మూడింట ఒక వంతు అటాచ్డ్ బాత్రూములు లేవు. దాంతో ఆ అవసరాలకు వైద్యులు అర్ధరాత్రి వేళల్లో బయటికి వెళ్లాల్సి వస్తోంది. సగానికి పైగా (53 శాతం) ప్రాంతాల్లో డ్యూటీ రూము వార్డు/ క్యాజు వాలిటీకి దూరంగా ఉంది. ప్రధానంగా జూ నియర్ డాక్టర్లు ఇలాంటి హింసను అనుభ విస్తున్నారు. పాలన లేదా విధాన రూప కల్పనలో వీరికి ప్రమే యం ఉండటం లేదు.వైద్యుల సూచనలు...→ శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలి.→ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.→ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ (సీపీఏ) అమలు చేయాలి.→ అలారం వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.→ తాళాలతో కూడిన సురక్షిత డ్యూటీ గదుల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.→ సురక్షితమైన, పరిశుభ్రమైన డ్యూటీ రూములు ఏర్పాటు చేయాలి.– ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల్లో మెరుగుదల అవసరం.→ ఆస్పత్రుల్లో తగినంత వైద్య సిబ్బందిని నియమించాలి.→ వార్డులు ఇతర ప్రాంతాల్లో రద్దీ లేకుండా ఏర్పాట్లు చేయాలి.అదనపు సూచనలుమద్యం సేవించిన లేదా మాదకద్రవ్యాల మత్తులో ఉన్న వ్యక్తుల నుంచి క్యాజువాలిటీలో పని చేస్తున్న వైద్యులు మౌఖిక, శారీరక బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. అత్యవసర గదుల్లో మహిళా వైద్యులకు అనవసరంగా తాకడం, అనుచిత ప్రవర్తన వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పరిమిత సిబ్బంది, తక్కువ భద్రత ఉన్న చిన్న ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు నిర్వాహకుల నుంచి ఉదాసీనత వ్యక్తమవుతోందని చాలా మంది వైద్యులు తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘AI’ ఎసరు .. భయాందోళనలో భారతీయ ఉద్యోగులు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో అభద్రత భావం ఎక్కువ అవుతోందని.. భారత్‌లో 47 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయం ఇదేనని ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సర్వేలో వెల్లడైంది. ‘‘ఆర్థిక అనిశ్చితులు, ఆటుపోట్ల తరుణంలో ఉద్యోగులు తమ ఉద్యోగం విషయంలో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడానికి తోడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల మానవ ఉద్యోగాలకు ఎసరు ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఉద్యోగుల్లో ఈ అభిప్రాయాలు నెలకొన్నాయి’’అని ఏడీపీ ఎండీ రాహుల్ గోయల్ తెలిపారు. దాదాపు అన్ని దేశాల యువ ఉద్యోగుల్లో ఉద్యోగ అభద్రత ఎక్కువగా ఉందని ఈ సర్వే తెలిపింది. 55 ఏళ్ల వయసువారితో పోలిస్తే 18–24 ఏళ్లలోని జెనరేషన్ జెడ్ ఉద్యోగుల్లో అభద్రతా భావం రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. ‘‘చాలా సంస్థలు ప్రతిభావంతులను గుర్తించడం, వారిని అట్టిపెట్టుకునే విషయంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కనుక కొందరు ఉద్యోగులు భావిస్తున్నంత దారుణ పరిస్థితులు లేవు’’అని గోయల్ చెప్పారు. ► మీడియా, సమాచార ప్రసార పరిశ్రమలో అంతర్జాతీయంగా ఎక్కువ ఉద్యోగ అభద్రత నెలకొంది. ఆ తర్వాత ఆతిథ్యం, లీజర్ పరిశ్రమలో ఇదే విధమైన పరిస్థితి ఉంది. ► సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది, తమ ఉద్యోగ భద్రత కోసం అవసరమైతే ఎలాంటి వేతనం లేకుండా అదనపు గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ► అంతర్జాతీయంగా జెనరేషన్ జెడ్ ఉద్యోగులు ప్రతి ఐదుగురిలో ఒకరు గత 12 నెలల్లో పరిశ్రమలు మారడాన్ని పరిశీలించినట్టు తెలిపారు. పావు వంతు మంది సొంత వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నట్టు చెప్పారు. ► 55 ఏళ్లకు చేరిన 17 శాతం మంది మందుస్తు రిటైర్మెంట్ పట్ల సానుకూలత చూపించారు. భరోసా అవసరం.. ‘‘ఈ సర్వే ఫలితాల ఆధారంగా చూస్తే.. తమకు విలువైన ఆస్తి అంటూ ఉద్యోగులకు కంపెనీలు భరోసా కలి్పంచాల్సిన అవసరం ఉంది. వారి కృషిని గుర్తించాల్సి ఉంది. సంస్థలో వారికి మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్న భరోసా అవసరం. లేదంటే కంపెనీలు కీలకమైన నైపుణ్యాలను, అనుభవాన్ని నష్టపోవాల్సి వస్తుంది. దీంతో తమ క్లయింట్లకు సేవలు అందించడంలో సమస్యలు ఎదురు కావచ్చు’’అని గోయల్ అభిప్రాయపడ్డారు. -
మెజారిటీ ప్రజల్లో ఆర్థిక అభద్రత
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల విస్తృతి పెరిగినప్పటికీ, దేశంలో మెజారిటీ ప్రజల్లో ఆర్థిక అభద్రతా భావం నెలకొని ఉన్నట్టు మనీ 9 సర్వే ప్రకటించింది. ‘‘ఒక భారతీయ కుటుంబం (4.2 మంది) సగటు ఆదాయం నెలకు రూ.23,000గా ఉంది. కానీ, 46 శాతం కుటుంబాల వాస్తవిక ఆదాయం నెలకు రూ.15,000 కంటే తక్కువే ఉంది. జీవన పమ్రాణాల పరంగా దేశంలో కేవలం 3 శాతం కుటుంబాలే ఉన్నత విభాగంలో ఉన్నాయి. వీటిల్లో అధిక భాగం ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలకు చెందినవి’’ అని ఈ సర్వే నివేదిక తెలియజేసింది. ఇతర అంశాలు.. ► 70 శాతం కుటుంబాలకు బ్యాంకు డిపాజిట్లు, బీమా, పోసాŠట్ఫీసు పొదుపు, బంగారం రూపంలో పెట్టుబడులు ఉన్నాయి. అత్యధికంగా వీరి పొదుపు ఉన్నది బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే. ఆ తర్వాత పోస్టాఫీసు పొదుపు పథకాలు, జీవిత బీమా, బంగారంలో వరుసగా ఉన్నాయి. ► 64 శాతం కుటుంబాలు బ్యాంకు డిపాజిట్లలో పెట్టుబడులు కలిగి ఉంటే, 19 శాతం కుటుంబాలకు జీవిత బీమా రూపంలో పెట్టుబడులు ఉన్నాయి. ► ఔత్సాహిక వర్గాల్లో 40 శాతం కుటుంబాలకు అసలు ఆర్థిక పొదుపులే లేవు. విధాన కర్తలు దీనిపై దృష్టి సారించాలన్నది ఈ సర్వే సూచనగా ఉంది. ► 22 శాతం కుటుంబాలకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, యులిప్‌లు, భౌతిక ఆస్తుల్లో (ప్రాపర్టీ తదితర) పెట్టుబడులు ఉన్నాయి. ► ప్రాపర్టీలు/భూములపై అత్యధికంగా 18 శాతం, మ్యూచువల్ ఫండ్స్‌లో 6 శాతం, స్టాక్స్‌లో 3 శాతం, యులిప్‌లలో 3 శాతం చొప్పున ఉన్నాయి. ► 11 శాతం కుటుంబాలు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఉన్నాయి. వీటిల్లో వ్యక్తిగత రుణాలు ఎక్కువ కాగా, ఆ తర్వాత గృహ రుణాలున్నాయి. -
భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో జరిగిన భద్రతాలోపంపై విచారణకు కేంద్ర హోంశాఖ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని గురువారం ఏర్పాటు చేసింది. కమిటీకి కేబినెట్ సెక్రటరీ (సెక్యూరిటీ) సుధీర్ కుమార్ సక్సేనా నాయకత్వం వహిస్తారు. ఇందులో ఐబీ జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్, ఎస్పీజీ ఐజీ సురేశ్ సభ్యులు.∙వేగంగా నివేదిక అందించాలని కమిటీని హోంశాఖ కోరింది. అలాగే ఘటనపై తక్షణ నివేదిక ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని హోంశాఖ ఆదేశించింది. మరోవైపు ఇదే ఘటనపై విచారణకు పంజాబ్ ప్రభుత్వం ఇద్దరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి మెహతాబ్ సింగ్ గిల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్ వర్మతో కూడిన ఈ కమిటీ మూడు రోజుల్లో నివేదికనందిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి పంజాబ్‌కు వచ్చిన ప్రధాని తీవ్రమైన భద్రతాలోపం కారణంగా బుధవారం అర్ధాంతరంగా ఢిల్లీకి వెనుదిరిగిన సంగతి తెలిసిందే! గురువారం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రధాని మోదీ ఫిరోజ్‌పూర్ ఘటనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించారు. భద్రతాలోపంపై రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారని కోవింద్ కార్యదర్శి తెలిపారు. ఈ విషయంపై దృష్టి పెట్టినందుకు రాష్ట్రపతికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం తన ఆందోళనను వెలిబుచ్చారు. గురువారం ఆయన మోదీతో మాట్లాడారు. నేడు సీజేఐ ముందుకు భవిష్యత్‌లో ఇలాంటి భద్రతా లోపాలు జరగకుండా ఫిరోజ్‌పూర్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని బెంచ్ ముందు ఈ పిటిషన్ దాఖలైంది. అత్యవసర అంశం కింద దీన్ని చేపట్టి గురువారమే దీనిపై విచారణ జరపాలని సింగ్ కోరారు. అయితే పిటిషన్ కాపీని పంజాబ్ ప్రభుత్వానికి పంపాలని, దీన్ని శుక్రవారం విచారణకు చేపడతామని బెంచ్ పేర్కొంది. పీఎం పర్యటన సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న అన్ని భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సాక్ష్యాలను భటిండా జిల్లా న్యాయమూర్తికి స్వాధీ నం చేయాలని ఆదేశించాలని లాయర్స్ వాయిస్ కింద దాఖలు చేసిన పిటిషన్లో సింగ్ కోరారు. ఉద్దేశపూర్వక చర్యల వల్లే భద్రతా వైఫల్యం చోటుచేసుకుందని... ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భద్రతా లోపమా.. రైతు ఆగ్రహమా? తేల్చండి: తికాయత్ నోయిడా: భద్రతా వైఫల్యమా, రైతుల ఆగ్రహామా? ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన అర్ధంతరంగా ముగియడానికి ఈ రెండింటిలో ఏది కారణమో తేల్చడానికి విచారణ జరపాలని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ గురువారం డిమాండ్ చేశారు. ‘భద్రతా కారణాల వల్లే ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దయిందని బీజేపీ అంటోంది. సభాస్థలిలో కుర్చీలన్నీ ఖాళీగా ఉండటంతోనే ప్రధాని అర్ధంతరంగా వెనుదిరిగారని సీఎం చన్నీ అంటున్నారు. దీంట్లో ఏది నిజమో నిగ్గుతేలాలి’ అని తికాయత్ ట్వీట్ చేశారు. -
భారత రాజకీయాలపై ఆర్థిక అభద్రతా ప్రభావం
న్యూఢిల్లీ: భారత్ యువతలో ఆర్థిక అభద్రతాభావం నెలకొందనీ, దేశ రాజకీయాలపై దీని ప్రభావం పెరుగుతోందని ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) పరిశోధనా నివేదిక ఒకటి పేర్కొంది. దేశాభివృద్ధిలో మందగమన ధోరణులు, నిరుద్యోగ సమస్యలను నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావించింది. భారత్ నిరుద్యోగ సమస్య దేశ రాజకీయాలతో విడదీయరాని అంశంగా రూపొందుతోందని నివేదిక పేర్కొంది, ఆర్థిక వృద్ధి మందగమనం నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేసిందని వివరించింది. ‘‘పటిష్ట నాయకత్వం, సామాజిక, భద్రతా అంశాల ప్రాతిపదికన ఈ ఏడాది రెండవసారి ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ విజయం సాధించినప్పటికీ, పెద్ద సంఖ్యలో ఉన్న యువత ఆర్థిక అభద్రతాభావమే దేశ రాజకీయాలకు రూపునిస్తున్న పరిస్థితి పెరుగుతోంది’’ అని ఈఐయూ పేర్కొంది. సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటాను ఈఐయూ నివేదిక ప్రస్తావిస్తూ, ‘‘2019 సెప్టెంబర్‌లో 7.2 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు మరుసటి నెల అక్టోబర్‌లోనే మూడేళ్ల గరిష్ట స్థాయి 8.5%కి పెరిగిన విషయాన్ని గుర్తు చేసింది. పెద్ద సంఖ్యలో ఉన్న యువతను చక్కటి మానవ వనరుగా వినియోగించుకుంటూ, రానున్న కొద్ది దశాబ్దాల్లో ఆర్థిక ప్రయోజనాలు పొందాలని దేశం భావిస్తున్నప్పటికీ, ఉపాధి కల్పనలో మాత్రం వెనుకబడుతున్నట్లు విశ్లేషించింది. -
మేం పచ్చి అబద్దాలకోరులం..
కశ్మీర్లో తమ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారన్న ఆగ్రహంతో రాష్ట్ర పోలీస్ అధికారుల కుటుంబీకులు 11 మందిని హిజ్బుల్ ఉగ్రవాదుల కిడ్నాప్ చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారుల కుటుంబాలు పడుతున్న మానసిక క్షోభ, కశ్మీర్‌లోయలో పరిస్థితులపై ఓ పోలీస్ అధికారి భార్య, ఉద్యోగిని అయిన ఆరీఫా తౌసిఫ్ ఓ స్థానిక వార్తాపత్రికకు భావోద్వేగ లేఖ రాశారు. శారీరకంగా పక్కనున్నా మానసికంగా విధుల్లోనే ‘ఒంటరిగా ఇంట్లో నిద్రపోవడమన్నది పెద్ద సమస్యేం కాదు. కానీ అర్ధరాత్రి భయంతో ఉలిక్కిపడి లేచిన సందర్భాల్లో పక్కనుండి ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు ఎవ్వరూ లేకపోవడంతో మానసిక క్షోభను అనుభవిస్తాం. అంతేకాదు భర్తతో కలసి ఈ రోజు లేదా రేపు లేదా ఎల్లుండి బయటకు వెళ్లాలనుకుని మేం అనుకుంటే అవి ఎప్పుడోకాని జరగవు. అదృష్టంకొద్దీ అది జరిగినా పోలీస్ అధికారులు శారీరకంగా మాత్రమే కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉంటారు. కానీ మానసికంగా, ఫోన్ ద్వారా వాళ్లు అప్పుడు కూడా విధుల్లోనే ఉంటారు. కశ్మీర్లో ఆపరేషన్ల సందర్భంగా ఎక్కడ, ఏ పోలీస్ అధికారి చనిపోయినా మేమంతా తీవ్రమైన భయం, అభద్రతాభావంలోకి జారిపోతున్నాం’ బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది కశ్మీర్లో పరిస్థితులపై స్పందిస్తూ.. ‘ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకనే కశ్మీర్లో యువకులు పోలీస్‌శాఖలో చేరుతున్నారు. వారు చదివింది ఒకటి. చేసేది మరోటి. దేశంలో కశ్మీర్లో మాత్రమే రిటైర్డ్ అధికారులు డిప్యూటీ సూపరింటెండెంట్(డీఎస్పీ)లుగా, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీచేసిన వారు ప్రభుత్వ అధికారులుగా చేస్తున్నారు. కొన్నిసార్లు ఇంటినుంచి బయటికెళ్లాలంటే భయమేస్తోంది. భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో పెల్లెట్లు తగలడంతో నష్టపోయినవారు, ఇతరులు ఆ దురదృష్టకర ఘటనకు మేమే బాధ్యులం అన్నట్లు చూస్తారు. ఏదైనా పోలీస్ అధికారికి ప్రమాదం జరిగితే కనీసం మా పట్ల సానుభూతి చూపేవారు ఒక్కరు కూడా ఉండటం లేదు. ఈ విషయాలను నా పిల్లలు చిన్నతనంలోనే అర్ధం చేసుకున్నారు. ప్రస్తుతం నా రాష్ట్రంపై కమ్ముకున్న కారు చీకట్లు తొలగిపోయి సుసంపన్నమైన, శాంతియుత కశ్మీర్‌ను చూడాలని నేను కోరుకుంటున్నా’ అంటూ తన భావోద్వేగ లేఖను ముగించారు. చిన్నచిన్న కోరికలూ సుదూర స్వప్నాలే.. ‘భర్తతో సరదాగా షికారు, కష్టసుఖాల్లో కలసిఉండటం వంటి చిన్నచిన్న కోరికలు సైతం పోలీస్ అధికారుల భార్యలకు సుదూర స్వప్నాలే. రాత్రి భర్త ఇంటికొస్తే కుటుంబమంతా కలసి భోంచేద్దామని ఎదురుచూస్తాం. కుటుంబంలో వేడుకలు, అంత్యక్రియలకు కలసి వెళ్లాలనుకుంటాం. పిల్లలతో కలసి షికారుకు వెళ్లాలనుకుంటా. కానీ వీటిలో ఏవీ నెరవేరవు. మా పిల్లలను ఒంటరిగా పెంచుతాం. మేం పచ్చి అబద్దాలకోరులం. మాలో చాలా మంది ‘నాన్న శనివారం ఇంటికొస్తారు’ ‘నాన్న పేరెంట్ మీటింగ్‌కు కచ్చితంగా వస్తారు’ ‘మనం ఈవారం నాన్నతో కలసి పిక్నిక్కు పోదాం’, ‘పండుగకు నాన్న ఇంటికొస్తానన్నారు’ అంటూ మా పిల్లలకు అబద్ధాలు చెబుతూనే ఉంటాం. అనారోగ్యంతో బాధపడే మా అత్తమామలకు ‘మీ అబ్బాయి ఫలానా రోజు వస్తానన్నారు’ అంటూ అబద్ధాలు చెబుతాం. ఇలా అబద్ధాలు చెబుతూ మమ్మల్ని మేమే మోసం చేసుకుంటున్నాం’ -
అభద్రతలో ముస్లింలు: అన్సారీ
న్యూఢిల్లీ: దేశంలోని ముస్లింలలో అభద్రత నెలకొందని, సామరస్య భావనకు ముప్పు ఏర్పడిందని ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై ప్రధాని మోదీతో, ఆయన కేబినెట్ సహచరులతో చర్చించానని బుధవారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పా రు. ప్రభుత్వం ఎలా స్పందించిందని అడగ్గా.. వివరణలు, కారణాలు ఎప్పుడూ ఉంటాయని, వాటిని అంగీకరించాలా, నిరాకరించాలా అన్నది మనం నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతిగా రెండో పర్యాయ పదవీకాలాన్ని గురువారంతో ముగించుకోనున్న అన్సారీ.. ఘర్ వాసపీ, గోరక్షకుల దాడులు, మైనారిటీలపై బీజేపీ నేతల వ్యాఖ్యలు తదితరాలపై స్పందించారు. ‘ముస్లింలలో అభద్రత, అసౌకర్య భావనలు వ్యాపిస్తున్నాయి. దేశపౌరుల భారతీయతను ప్రశ్నించడమనేది ఇబ్బందికరమైన విషయం. జాతీయవాదాన్ని ప్రతిరోజూ ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు.. నేను భారతీయుడిని.. అంతే’ అని అన్నారు. -
రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకం
కోడెల గెలిచిన తర్వాతే ఈ దుస్థితి.. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే గోపిరెడ్డి నరసరావుపేట: డాక్టర్ కోడెల శివప్రసాదరావు శాసనసభ్యుడిగా గెలిచి స్పీకర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. స్పీకర్ కోడెల మాటలు విని.. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఆయనకు,ఆయన కుమారుడికి గుండాలుగా పని చేయటం ప్రమాదకరమైన విషయమన్నారు. రైల్వే కాంట్రాక్టర్‌పై దౌర్జన్యం కేసులో ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకున్నారంటే ఆయనే ప్రోత్సహిస్తున్నట్లుగా అర్థమవుతోందన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నడికుడి– శ్రీకాళహస్తి పనులు చేస్తున్న రైల్వే కాంట్రాక్టర్, ఆయన మనుషులు, కూలీలపై స్పీకర్ కోడెల, ఆయన కుమారుడు పంపిన గుండాలు దాడిచేసి ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. దీనిపై కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదుచేస్తే, వారిపై మరో కౌంటర్ కేసును నమోదుచేయటం దారుణమన్నారు. ఈ సంస్కృతి కోడెల శాసనసభ్యుడిగా అయిన దగ్గర నుంచి ఉందని, తెలుగుదేశం వారు ఎవరినైనా కొడితే కేసు పెట్టడానికి వెళ్ళిన వ్యక్తిపైనే కేసు పెట్టి బెదిరించి రాజీచేసే ప్రక్రియకు పాల్పడుతున్నాన్నారు. పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో, సత్తెనపల్లి, నరసరావుపేటల్లో శాంతిభద్రతలు ఏవిధంగా రక్షించబడతాయో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కోడెల గెలిచిన తర్వాత సత్తెనపల్లిలో పోలీసులే గుండాలుగా వ్యవహరించి తమ పార్టీ ఎంపీటీసీలను అపహరించుకెళ్ళారన్నారు. సత్తెనపల్లిలోని వెన్నాదేవి దగ్గర పోలీసులకు ఏవిధమైన సంబంధంలేకపోయినా ఒక స్థలం వద్దకు వెళ్ళి ఆ స్థల యజమానిని భలవంతంగా ఖాళీచేయించిన తర్వాత కోడెల శివప్రసాదరావు గుండాలు ప్రవేశించారన్నారు. దీనిని బట్టి పోలీసు వ్యవస్థ ప్రజల మానప్రాణాలను రక్షించటానికంటే కోడెల, అతని కుమారుడికి ఖాకీ డ్రస్సు వేసుకున్న గుండాలుగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇది సమాజానికి,. పోలీసులకు మంచిది కాదన్నారు. కమిషన్ లేనిదే ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరూ ఏ పనిచేసే పరిస్థితిలేదన్నారు. మొన్న స్పీకర్‌ను లోకేష్ కలిసిన తర్వాత కాంట్రాక్టర్‌పై దౌర్జన్య వ్యవహారం చోటుచేసుకుందన్నారు. లోకేష్, స్పీకర్, చంద్రబాబులు ఇప్పటికే ప్రజలను దోచుకుంటున్నారని, అయితే ఇంత దౌర్జన్యంగా ఇక్కడ దోచుకోవటం జరుగుతున్నా పోలీసులు చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. అంతా కోడెల కుమారుడి లీల.. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ సంగం డెయిరీ రైతులకిచ్చే బోనస్‌లో లీటర్‌కు అర్ధ రూపాయి కమీషన్ కావాలని స్పీకర్ కోడెల కుమారుడు డిమాండ్ చేయటంతో రెండు నెలలుగా ఆ సంస్థ బోనస్ చెల్లించలేదన్నారు. దీనిపై రైతులు తన దృష్టికి తీసుకురావడంతో డెయిరీ మేనేజర్‌ను ప్రశ్నిస్తే ఈ విషయం వెల్లడైందన్నారు. ఈ విధంగా వ్యవహరిస్తున్న వీరి చేష్టలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. సమావేశంలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్‌మాబు, సత్తెనపల్లి మార్కెటింగ్‌యార్డు మాజీ ఛైర్మన్ కట్టా సాంబయ్య, రాజుపాలెం మాజీ ఎంపీపీ బాసు లింగారెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి కోడిరెక్క దేవదాసు తదితరులు పాల్గొన్నారు. -
దళితుల్లో అభద్రత పెంచిన మోదీ : కొప్పుల రాజు
ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు సాక్షి, హైదరాబాద్: దళితులపై కాకుండా తనపై దాడి చేయాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో దళితుల్లో, మైనారిటీల్లో మరింత అభద్రత పెరిగిందని ఏఐసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్కతో కలసి మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. దళితులకు ప్రత్యేకంగా ఉన్న చట్టాలను అమలు చేస్తామని, దాడులు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మోదీ చెప్పలేదన్నారు. భరోసా కల్పించేవిధంగా మాట్లాడకుండా, మరింత ప్రోత్సహించే విధంగా మోదీ మాట్లాడటంతో మరింత అభద్రత, ఆందోళన పెరుగుతున్నదన్నారు. గో రక్షక్ విషయంలో చట్టంపై నమ్మకాన్ని కలిగించేలా మోదీ ఎందుకు మాట్లాడలేదని రాజు ప్రశ్నించారు. రెండేళ్లుగా మైనారిటీలపై, దళితులపై దాడులు జరుగుతున్నా నోరెందుకు విప్పలేదన్నారు. జీవో 123పై సుప్రీంకు... జీవో 123పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగు, ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలపై వాస్తవ జలదృశ్యాన్ని ఈ నెల 17న ఆవిష్కరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టి, ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలేమిటో ప్రజలకే వెల్లడిస్తామన్నారు. ఈ నెల 16న ఆదిలాబాద్‌లో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం, సాయంత్రం రైతు గర్జన ఉంటాయన్నారు. -
అందుకే హీరోయిన్లు స్నేహంగా ఉండరట
ముంబై: కేవలం ఇన్సెక్యూరిటీ కారణంగానే బీ టౌన్ భామలు దూరం దూరంగా ఉంటారంటోంది హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. అభద్రతా భావం వల్లే బాలీవుడ్ హీరోయిన్లు స్నేహంగా ఉండరట. అంతేకాదు మీరు అభద్రతగా ఫీలయితే ఇంకెవరితోనూ స్నేహితుల్లా కలవరలేని సలహా కూడా ఇస్తోంది. కానీ తను అలా కాదట. బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ లాగా తను చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటానని చెబుతోంది. అందుకే తనకు సోనమ్ అంటే చాలా ఇష్టమని చెబుతోంది. ఆమె చాలా తెలివైందని, చాలా ఆత్మ విశ్వాసంతో ఉంటుందని అంది. అందుకే ఆమె చిన్న వయసులోనే చాలా విజయాలు సాధించిందంటోంది. అందుకే సోనమ్ ని ఫాలో అయిపోతానంటోంది ఈ బ్రదర్స్ భామ. ఇప్పటికే శ్రీలంకలో ఒక హోటల్‌ను నడుపుతున్న ఈ ముప్పయేళ్ల హీరోయిన్ భారత్‌లో కూడా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు యోచిస్తోంది. భారతీయులకు శ్రీలంక రుచులను పరిచయం చేయాలనుకుంటోందిట. అందుకే ముంబైలో ఒక రెస్టారెంట్నొకదాన్నిఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నానని చెబుతోంది. భారత్, శ్రీలంక ఆహారపు అలవాట్లు దాదాపు ఒకేలా ఉంటాయని పేర్కొంది. ఒక సారి తన హెటల్ ఫుడ్ తిన్నవారు మళ్లీమళ్లీ రావాల్సిందే అంటోంది. బాలీవుడ్ స్టయిలిష్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న జాక్వెలిన్ దుస్తుల బిజినెస్‌లోకి మాత్రం రానంటోంది. అది సోనమ్ లైన్ తనది నాది కాదని చమత్కరించింది. -
అభద్రతేమీ లేదంటున్న సోనాక్షి
బాలీవుడ్లో తనకు ఎలాంటి అభద్రత లేదంటోంది సోనాక్షి సిన్హా. ఇతర నటీమణులతో తెర పంచుకోవడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటోంది. ‘యాక్షన్ జాక్సన్’లో యామీ గౌతమ్, మనస్వీ మంగాయ్లతో కలసి నటించడంపై మీడియా సంధించిన ప్రశ్నలకు ఆమె ఇలా స్పందించింది. నిజానికి మల్టీస్టారర్ చిత్రంలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది.