
అభద్రతేమీ లేదంటున్న సోనాక్షి
బాలీవుడ్‌లో తనకు ఎలాంటి అభద్రత లేదంటోంది సోనాక్షి సిన్హా.
బాలీవుడ్‌లో తనకు ఎలాంటి అభద్రత లేదంటోంది సోనాక్షి సిన్హా. ఇతర నటీమణులతో తెర పంచుకోవడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటోంది. ‘యాక్షన్ జాక్సన్’లో యామీ గౌతమ్, మనస్వీ మంగాయ్‌లతో కలసి నటించడంపై మీడియా సంధించిన ప్రశ్నలకు ఆమె ఇలా స్పందించింది. నిజానికి మల్టీస్టారర్ చిత్రంలో నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది.