
అభద్రతలో ముస్లింలు: అన్సారీ
ఉప రాష్ట్రపతిగా రెండో పర్యాయ పదవీకాలాన్ని గురువారంతో ముగించుకోనున్న అన్సారీ.. ఘర్ వాసపీ, గోరక్షకుల దాడులు, మైనారిటీలపై బీజేపీ నేతల వ్యాఖ్యలు తదితరాలపై స్పందించారు. ‘ముస్లింలలో అభద్రత, అసౌకర్య భావనలు వ్యాపిస్తున్నాయి. దేశపౌరుల భారతీయతను ప్రశ్నించడమనేది ఇబ్బందికరమైన విషయం. జాతీయవాదాన్ని ప్రతిరోజూ ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు.. నేను భారతీయుడిని.. అంతే’ అని అన్నారు.