సోనారే సోనా | sonam kapoor new fashion dress | Sakshi
Sakshi News home page

సోనారే సోనా

Published Thu, Oct 5 2017 11:28 PM | Last Updated on Fri, Oct 6 2017 4:42 AM

sonam kapoor new fashion dress

హిందీలో సోనా అంటే బంగారం.
సోనమ్‌ కపూర్‌లా సంప్రదాయాన్ని,
ఆధునికతను మిక్స్‌ చేసి డ్రెస్‌ చేసుకుంటే..
బంగారానికి అందాల పూత పోసినట్లుంటుంది.
మన ఇంటి బంగారు తల్లులు కూడా ఇలా...
ఒద్దికైన బట్టల్లో మోడర్న్‌గా కనిపించవచ్చు.

సన్నగా ఉన్నవారు జార్జెట్, నెటెడ్‌ వంటి  చీరలు కట్టుకోవడానికి ఇబ్బంది పడతారు ఇంకా సన్నగా కనపడతారని. కానీ, ఇలా డిజైనర్‌ బ్లౌజ్‌ దానికి తగ్గట్టు చీర కట్టు, కేశాలంకరణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే  ఈవెనింగ్‌ పార్టీలో ఆకర్షణీయంగా కనిపిస్తారు.  

ఇది లాంగ్‌ అనార్కలీ, పలాజో డ్రెస్‌. గౌన్‌ ధరించినప్పుడు కరెక్ట్‌ ఫిట్‌తో పాటు కలర్‌ కాంబినేషన్‌ తప్పనిసరి సరిచూసుకోవాలి. ఈ డ్రెస్‌ మీదకు ఆభరణాల అలంకరణ ఎంత తక్కువగా ఉంటే అంత అందంగా కనిపిస్తారు.

డిజైనర్‌ ధోతీప్యాంట్‌ వేసుకొని, టాప్‌ కోసం అదే రంగు స్లీవ్‌లెస్‌ ట్యూనిక్, ఆ పైన ఎంబ్రాయిడరీ చేసిన ఓవర్‌ కోట్‌ ధరిస్తే పార్టీలో ఓ కొత్త లుక్‌తో మెరిసిసోవచ్చు. చెవులకు ఆభరణాలు, ఫిష్‌టెయిల్‌ హెయిర్‌స్టైల్‌ మిమ్మల్ని నలుగురిలో వినూత్నంగా కనిపించేలా చేస్తుంది.


సింగిల్‌ పీస్‌ ఫ్లోరల్‌ ప్రింట్స్‌ లాంగ్‌ స్లీవ్స్‌ గౌన్‌ ధరించి, ఒక బెల్ట్‌తో పూర్తి లుక్‌ మార్చేయవచ్చు. ఇదే స్టైల్‌ని చీరకట్టు, గాగ్రాచోళీతోనూ తెప్పించవచ్చు. పీటర్‌ప్యాన్‌ కాలర్‌నెక్‌ బ్లౌజ్‌ని ఎంచుకుంటే చాలు. ఇండో వెస్ట్రన్‌ లుక్‌తో అట్రాక్ట్‌ చేస్తారు.
ఈ కంచిపట్టు చీర అంచు, పల్లూలోనూ రాజస్థానీ థీమ్‌తో ఎంబ్రాయిడరీ వర్క్‌ చేశారు. పండుగలు, పెళ్ళిళ్లు వంటి శుభకార్యాలకు పట్టుచీరలు సంప్రదాయ కళను తీసువస్తాయి. ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, వీటి మీదకు పాతకాలం నాటి టెంపుల్‌ జువెల్రీ ధరిస్తే అందమంతా ఒక్క చోట కుప్పపోసినట్టుగా ఇల్లంతా కళకళలాడిపోతుంది.

పాశ్చాత్య లేదా సంప్రదాయ వేడుకలకు ఏ తరహా డ్రెస్సింగ్‌ బాగుంటుందని ఎక్కువ హైరానా పడనవసరం లేదు. లాంగ్‌ అనార్కలీ ్రడ్రెస్‌ ఉంటే దాని మీదకు ఎంబ్రాయిడరీ చేసిన ఓవర్‌కోట్, ష్రగ్‌ వంటివి ధరిస్తే గ్రాండ్‌గా
కనిపిస్తారు.

ఇది త్రీ పీస్‌ శారీ డ్రెస్‌. సంప్రదాయ వేడుకల్లో యువరాణిలా వెలిగిపోవాలంటే ఈ తరహా డ్రెస్సింగ్‌ మంచి ఎంపిక. ప్లెయిన్‌ క్రీమ్‌ కలర్‌ చీర కట్టు దాని మీదకు, ఎంబ్రాయిడరీ చేసిన స్లీవ్‌లెస్‌ బ్లౌజ్, ఆ పైన బంగారు రంగు లాంగో ఓవర్‌ కోట్‌« దరిస్తే వైవిధ్యంగా కనిపిస్తారు. ఒక చిన్న మార్పుతో ఎక్కడ ఉన్నా యువరాణిని తలపిస్తారు.

ఏ ఫంక్షన్‌ జరిగినా అమ్మాయిలు డిజైనర్‌ లంగా ఓణీలు, గాగ్రాచోళీలు «ధరించడం సాధారణమైపోయింది. వీటిలోనూ మీదైన స్టైల్‌ కనిపించాలంటే బ్లౌజ్‌లో ఓ చిన్న మార్పు తీసుకువచ్చి లుక్‌లో సెలబ్రిటీ స్టైల్‌ తీసుకురావచ్చు. సెల్ఫ్‌ ఎంబ్రాయిడరీ చేసిన లెహంగా, సింగిల్‌ స్లీవ్‌ బ్లౌజ్‌కే ఒన్‌ సైడ్‌ దుపట్టా జత చేయడం ఈ స్టైల్‌ ప్రత్యేకత. 
నిర్వహణ: ఎన్‌.ఆర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement