వేటగాళ్ల ఉచ్చుకు చిరుత బలి
వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత నాలుగు కాళ్లు నరికేసి ఉన్నాయి. చిరుత కాళ్లకు, మెడకు ఉరి పడ్డట్లు తెలుస్తోంది. ఉచ్చుల నుంచి తప్పించుకోవడానికి చిరుత 7 నుంచి 8 గంటలపాటు పెనుగులాడినట్టు శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా తెలుస్తోంది. చిరుత ఎక్కడో ఉచ్చుకు చిక్కి చనిపోగా... వేటగాళ్లు గుట్ట మీదకు తీసుకొచ్చి, చిరుత గోళ్ల కోసం దాని కాళ్లు నరికి తీసుకెళ్లినట్టు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. చిరుత కళేబరం నుంచి కొన్ని భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు అటవీ అధికారులు పంపించారు. ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు తెలిపారు.