దుప్పులను వేటాడింది మేమే... | Deer hunters surrendered to the police | Sakshi
Sakshi News home page

దుప్పులను వేటాడింది మేమే...

Published Sun, Mar 26 2017 12:58 AM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

దుప్పులను వేటాడింది మేమే...

దుప్పులను వేటాడింది మేమే...

లొంగిపోయిన వేటగాళ్లు...ముగ్గురి రిమాండ్‌
కరీంనగర్‌ సబ్‌ జైలుకు తరలింపు
పరారైన నాలుగో నిందితుడు టీఆర్‌ఎస్‌ నేత అక్బర్‌ఖాన్‌
నాలుగు రోజులుగా పట్టించుకోని పోలీసులు


సాక్షి, భూపాలపల్లి/మంథని: మహదేవపూర్‌ అడవుల్లో దుప్పులను వేటాడింది తామేనంటూ ముగ్గురు నిందితులు శుక్రవారం సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహదేవ పూర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రభాను ఎదుట ఈనెల 24న లొంగిపోగా, వీరిని అదేరోజు రాత్రి 11 గంటలకు పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి నాగేశ్వర రావు ఎదుట హాజరుపరిచారు. అనంతరం  కరీంనగర్‌ సబ్‌జైలుకు తరలించారు.

కోర్టుకు సమర్పించిన రిమాండు పత్రంలో మొత్తం నలు గురిని నిందితులుగా పేర్కొన్నారు. ఏ–1గా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చెందిన నలువాల సత్యనారాయణ అలి యాస్‌ సత్తెన్న(55), ఏ–2గా జయశంకర్‌ జిల్లా మహ దేవపూర్‌ మండలం ఖాన్‌పూర్‌కు చెందిన మహ్మద్‌ ఖలీముల్లాఖాన్‌(25), ఏ–3గా జయ శంకర్‌ జిల్లా మహదేవపూర్‌ మండలం ఖాన్‌పూర్‌ కు చెందిన అస్రార్‌ అహ్మద్‌ ఖురేషీ(28), ఏ–4గా మహదేవపూర్‌ మండలానికి చెందిన టీఆర్‌ఎస్‌ నేత మహ్మద్‌ అక్బర్‌ఖాన్‌ను పేర్కొన్నారు.  అక్బర్‌ పరారీలో ఉన్నాడు.

రెండు లైసెన్స్‌డ్‌ తుపాకులు..
నిందితుల్లో ఇద్దరి వద్ద లైసెన్స్‌డ్‌ తుపాకులు ఉన్నాయి. సత్తెన్న తుపాకీతోపాటు 150 తుటా లను పోలీసులకు అప్పగించాడు. అక్బర్‌కు చెందిన లైసెన్సు తుపాకీ వేట కొనసాగినప్పుడు తన వెంట ఉన్నట్లు రిమాండ్‌ డైరీలో పేర్కొన్నా రు.  ఈ ప్రాంతంలో వేటాడేందుకు వచ్చే వారికి  సహకరిస్తున్నారనే ఆరోపణలు అక్బర్‌ మీద  ఉన్నాయి. నిందితులు అక్బర్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌లో ఈనెల 19న సమావేశమయ్యారు. అక్కడ మద్యం సేవించిన అనంతరం ఈ ముగ్గురి తోపాటు మరో ఇద్దరు కారులో వన్యప్రా ణులను వేటాడేందుకు సర్వాయిపేట వైపునకు వెళ్లినట్లుగా పేర్కొన్నారు. అక్బర్‌ 4 రోజులు దర్జాగా తిరిగి నట్లు స్థానికులు చెబుతున్నారు. కేసులో కీలకంగా మారిన  అక్బర్‌ ను అరెస్టు చేస్తే పెద్ద తలకాయల గుట్టురట్టయ్యే ఆస్కారముండేది. కేసులో ప్రధానపాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్న వ్యక్తులను తప్పించేం దుకు విచారణ మంద కొడిగా సాగిస్తున్నారనే ఆరోపణ లున్నాయి.

వేట వెనుక మంత్రుల హస్తం
దుప్పుల వేట కేసులో రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులకు సంబంధముందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.  మహదేవపూర్‌ జెడ్పీ టీసీ సభ్యురాలు హసీనాభాను భర్త, టీఆర్‌ఎస్‌ నేత అక్బర్‌ఖాన్‌ నిందితుడిగా పేర్కొన్న నేపథ్యం లో ఆ మంత్రుల పాత్రా ఉందని అంటున్నారు. వేటకు సంబంధించి వాస్తవాలు సేకరించేందుకు అటవీశాఖ విజిలెన్స్‌ ప్రిన్సిపల్‌ కన్జర్వేటర్‌ శ్రీనివాస్‌ మహదేవపూర్‌ అటవీ ప్రాంతంలో వస్తున్నట్లు సమాచారం.  స్థానికులు, అటవీశాఖ, పోలీసుల నుంచి వివరాలు రాబట్టనున్నారు.  

నన్ను బలిపశువును చేస్తున్నారు
దుప్పులవేట కేసులో ఏ –1 ఆగ్రహం
దుప్పులవేట కేసులో   ఏ–1 నిందితుడిగా నలువాల సత్యనారాయణ అలియాస్‌ సత్తెన్న అప్రూవర్‌గా మారేందుకు ప్రయత్నించాడు.  ప్రధాన నిందితులను తప్పించేందుకు తనను బలిపశువు చేస్తున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వేట ఘటనపై మీడియాలో  కథనాలు రావడం, అసెంబ్లీలో చర్చకు రావడం, ప్రతిపక్షాలు  విమర్శలు గుప్పించిన నేపథ్యంలో సత్య నారా యణ, ఖలీముల్లాఖాన్, అస్రార్‌ అహ్మద్‌ ఖురేషీ లు  మహదేవపూర్‌ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. 

సత్య నారాయణను ఏ1గా, మిగిలిన ఇద్దరిని ఏ 2, ఏ 3లుగా పేర్కొంటూ తొలుత రిమాండ్‌ డైరీ రూపొం దించినట్లు సమాచారం.  అక్బర్‌ఖాన్‌ను వదిలి తనను ఏ1గా ఎలా పేర్కొంటారని సత్యనా రాయణ ఎదురు తిరిగి నట్లు తెలుస్తోంది. దీంతో అసలుకే ఎసరు వస్తుందని అక్బర్‌ను ఏ4గా పేర్కొన్నట్లు తెలిసింది. అక్బర్‌  పోలీసు స్టేషన్‌ నుంచి వెళ్లిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్‌ పూర్తి చేసి శుక్రవారం రాత్రి  మిగిలినవారిని జడ్జి ఎదుట హాజరుపరిచారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement