Deer hunting case
-
హైదరాబాద్‌లో కృష్ణ జింక వేటగాళ్లు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ముగ్గురు కృష్ట జింక వేటగాళ్లను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వేటగాళ్లు ఓ జింకను నిజామాబాదులోని వేటాడి చంపారు. మరొక జింకనుతో పాటుగా చంపిన జింక మాంసాన్ని తీసుకువస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వేటగాళ్ల చెర నుంచి కృష్ణజింకను పోలీసులు రక్షించారు. చదవండి: ఆరోగ్యం బాగుచేస్తానని..ఆభరణాలతో మాయం! చదవండి: 'భర్తకు రెండో పెళ్లి చేయాలని చూస్తున్నారు' -
తిప్పేశ్వర్ పులి.. శివ్వారంలో బలి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎక్కడో తిప్పేశ్వర్ అభయారణ్యంలో పుట్టిన పులి.. ఆహారం కోసం ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన నెల రోజులకే వేటగాళ్ల ఉచ్చుకు చిక్కి బలైంది. ఆదిలాబాద్ అడవుల్లోకి మరో పులి వచ్చి చేరిందన్న సంతోషం నెల రోజుల్లోనే ఆవిరైంది. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో లభించిన పులి చర్మం కవ్వాల్‌లో కనిపించిన పులిదేనని అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించడం లేదు. ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నట్లు చెబుతున్నా.. పులి చర్మం తాజాగా ఉండటం, కవ్వాల్‌లో కనిపించిన పులి మాయమవడం, పులి ఫొటోలు, పులి చర్మం ఒకేరకంగా ఉండటాన్ని బట్టి కవ్వాల్‌లో కనిపించిన పులిగానే నిర్ధారించారు. నీల్వాయి ప్రాంతంలో తిరుగుతున్న కె–4 ఆడపులి సాంగత్యం కోసం గానీ, గుంపులుగా సంచరించే జింకల కోసమో ఈ పులి శివ్వారం అడవుల్లోకి వచ్చినట్లు అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. అడవి పందులు, జింకల కోసం అమర్చిన విద్యుత్ ఉచ్చులో చిక్కుకొని 15 రోజుల క్రితమే ఈ పులి హతమైంది. శివ్వారానికి చెందిన తొమ్మిది మంది పులిని హతమార్చిన ఘటనలో నిందితులు కాగా సాయిలుని ఏ–1గా పోలీసులు కేసు నమోదు చేశారు. కొమురయ్య, సాయిలు కొడుకు శ్యామ్, మధునయ్య, లింగ య్యలను అరెస్టు చేసి పీడీపీపీ చట్టం కింద కేసులు నమోదు చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. పోలీసుల చర్యతోనే.. మందమర్రిలో పులి చర్మం వెలుగుచూసిన వ్యవహారంపై రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు తక్షణమే స్పందించి ఒక్కరోజులోనే కేసు మిస్టరీని ఛేదించింది. నిందితులను విచారించగా, శివ్వారంలో పులిని హతమార్చిన ప్రాంతం వివరాలు వెల్లడించారు. ఈ మేరకు కమిషనర్ సత్యనారాయణ, డీసీపీ వేణుగోపాల రావు, డీఎఫ్ఓ రామలింగం, ఇతర అటవీ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి ఘటనా స్థలాన్ని సందర్శించారు. -
సల్మాన్ బాధంతా ఆమె గురించే..
రాజస్తాన్: జోధ్‌పూర్ సెంట్రల్లో ఉన్న సమయంలో బాలీవుడ్ కండల నటుడు సల్మాన్ ఖాన్ ఎక్కువగా తన తల్లి గురించే బాధపడేవాడని రాజస్థాన్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ నడుమ సల్మాన్ ఖాన్ తల్లి సుశీలా చరక్ అలియాన్ సల్మా ఆరోగ్యం బాగాలేదని, సల్మాన్ ఖాన్ జైలులో ఉన్నట్లు తెలిస్తే ఆమెకు ఇంకా బాధ ఎక్కువైపోతుందనే సల్మాన్ డీలా పడిపోయాడని స్థానిక జైళ్ల శాఖ డీఐజీ విక్రమ్ సింగ్ కర్ణావత్ తెలిపారు. సల్మాన్ ఖాన్ జైలుకు వచ్చిన సమయంలో కొంచెం ఆందోళనకు గురయ్యాడని, ఆ తర్వాత కుదురుకున్నాడని ఆయన తెలిపారు.సల్మాన్ ఖాన్‌ను కలిసేందుకు చాలా మంది సందర్శకులు వచ్చేవారని, కానీ సల్మాన్ వారందరినీ కలిసేందుకు అంత ఆసక్తి చూపించలేదని డీఐజీ తెలిపారు. ‘ జైలులో రోజూ ఉదయం అల్పాహారం చేసి జైలు గదిలో తిరిగేవాడు. సల్మాన్‌కు నాలుగు దుప్పట్లు ఇచ్చాం. కసరత్తుల కోసం ఎలాంటి పరికరాలు ఆయన అడగలేదు. కేవలం ఫ్లోర్‌ను మాత్రమే ఉపయోగించేవాడు’ అని విక్రం సింగ్ తెలిపారు. ‘ మొదటి రోజు సల్మాన్ తరపు న్యాయవాదులు వచ్చి ఆయనను కలిశారు. తర్వాత సినీ నటి ప్రీతి జింతా, ఆయన చెల్లెల్లు అల్విరా, అర్పితా ఖాన్లు ఆయనను సందర్శించారు. సల్మాన్‌కు బెయిల్ వచ్చిన తర్వాత మొదటగా ఆయన తన తల్లి సుశీలా చరక్‌కు ఫోన్ చేశారు’ అని విక్రం సింగ్ వివరించారు. ‘ సల్మాన్ ఖాన్‌కు బెయిల్ వచ్చిన విషయం చెప్పగానే ఆయన ముఖంలో ఎటువంటి ఆనందం కనిపించలేదు. వెంటనే స్నానం చేసి తన దుస్తులు ప్యాక్ చేసుకున్నారు’ అని డీఐజీ తెలిపారు. ‘ సల్మాన్ ఖాన్‌ను కలిసేందుకు పలువురు ఖైదీలు ఉత్సాహం చూపేందుకు ప్రయత్నించడంతో ఆయన సెక్యూరిటీ పాయింట్ వద్ద నుంచే చేతులు ఊపుతూ గ్రీట్ చేశారు. అలాగే జైలు నిబంధనలు ఉల్లంఘించవద్దని, డీఐజీని ఇబ్బందిపెట్టవద్దని ఖైదీలను సల్మాన్ సూచించారు’ అని డీఐజీ విక్రం చెప్పారు. సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు ఈ నెల 5 న ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెల్సిందే. రెండు రోజులు జైలులో గడిపిన అనంతరం ఈ నెల 7న కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. -
డాక్టర్ ముజాహిద్... సిటీ ‘సల్మాన్’
సాక్షి, హైదరాబాద్: కృష్ణజింకల వేటకు సంబంధించి మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ సమీపంలో కృష్ణజింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల శిక్ష పడటం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పూర్తిగా సద్దుమణగకముందే నగరానికి చెందిన ఓ ‘సల్మాన్ ఉదంతం’బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన డెంటిస్ట్ డాక్టర్ ముజాహిద్ అలీఖాన్ మరో ముగ్గురితో కలసి కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలో ఈ నెల 29న కృష్ణజింకల్ని వేటాడారు. మరునాడు తిరిగి వస్తుండగా బసవకల్యాణ్ ప్రాంతంలో పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. వేట కోసం సిటీ నుంచి వెళ్లి... ముజాహిద్ అలీఖాన్ వృత్తిరీత్యా దంతవైద్యుడు. దుబాయ్‌లో ఉంటున్న ఈయన ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. నగరానికే చెందిన స్నేహితులు సయ్యద్ అజర్, యాకూబ్లతో కలసి జీపులో గత నెల 29న బీదర్ ప్రాంతానికి వెళ్లారు. కర్ణాటకలోని హుమ్నాబాద్‌కు చెందిన శ్రీకాంత్ అనే పరిచయస్తుడి నుంచి కృష్ణ జింకల సమాచారాన్ని సేకరించారు. రాత్రంతా హల్సూర్ గ్రామ సమీపంలో మూడు జింకల్ని వేటాడారు. మరునాడు జీపులో తిరిగి వస్తుండగా బీదర్‌కు 35 కి.మీ దూరంలో బసవకల్యాణ్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి వద్ద మాంసంతోపాటు చర్మం, విదేశాల్లో తయారైన 0.22 క్యాలిబర్ రైఫిల్, తూటాలు, ఆరు కత్తులు లభించాయి. పోలీసులు ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని, జీపును స్వాధీనం చేసుకున్నారు. హుమ్నాబాద్‌లో శ్రీకాంత్‌ను కూడా పట్టుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని సెక్షన్ 9, 51 ప్రకారం ఈ నలుగురిపై కేసులు నమోదు చేశారు. కేసును శనివారం బీదర్ అటవీ అధికారులకు అప్పగించారు. గతంలో రెండుసార్లు కర్ణాటకలో కృష్ణజింకల్ని వేటాడిన ఈ ముఠా ఎట్టకేలకు మూడోసారి పోలీసులకు చిక్కింది. తరచూ హైదరాబాద్, ఆ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అనేక మంది జింకల్ని వేటాడటం కోసం వస్తుండడంతో ఇటీవల నిఘా ముమ్మరం చేశారు. -
జైలులో సల్మాన్‌కు నిద్రలేని రాత్రి
జోధ్‌పూర్: జింకలను వేటాడిన కేసులో శిక్షననుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ కేంద్రీయ కారాగారంలో తొలిరోజు రాత్రి నిద్రలేకుండానే గడిపారని అధికారులు శుక్రవారం చెప్పారు. జైలులోని బ్యారక్ నంబర్ 2లో ఖైదీ నంబర్ 106గా ఉన్న సల్మాన్‌కు ప్రత్యేక సదుపాయాలేవీ కల్పించడం లేదనీ, అల్పాహారంగా మొలకెత్తిన విత్తనాలు, పాలు ఇచ్చామని జైళ్ల డీఐజీ విక్రం చెప్పారు. చెక్క మంచం, రగ్గు, కూలర్ సల్మాన్ గదిలో ఉంటాయన్నారు. సల్మాన్ బెయిలు దరఖాస్తుపై నిర్ణయాన్ని కోర్టు శనివారానికి వాయిదా వేసింది. నటి ప్రీతీ జింతా సల్మాన్‌ను పరామర్శించారు. 1998లో రెండు కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలుశిక్షను సెషన్స్ కోర్టు విధించడం తెలిసిందే. సల్మాన్ చెల్లెళ్లు అర్పిత, అల్విరలు ఆయనను శుక్రవారం కలుసుకున్నారు. జైలు యూనిఫాం ఇంకా సిద్ధం కానందున తన సాధారణ దుస్తులనే సల్మాన్ ధరించారు. రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపు పక్క గదిలోనే సల్మాన్‌ను ఉంచామనీ, గురువారం రాత్రి వారిద్దరూ పలకరించుకున్నారని సిబ్బంది చెప్పారు. గదిలో టాయిలెట్ గురించి సల్మాన్ అడిగాడనీ, గీజర్ ఉందేమోనని కనుక్కున్నాడని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. రెండో పోస్టుమార్టం పట్టించింది.. కృష్ణజింకల కళేబరాలకు రెండోసారి నిర్వహించిన పోస్టుమార్టం ద్వారానే సల్మాన్ దోషి అని నిరూపితమైంది. కళేబరాల ఎముకల్లో అంగుళం వ్యాసంతో రంధ్రాలు ఉన్నాయనీ, తుపాకీతో పేల్చడం వల్లనే ఇలా జరిగిందని పోస్టుమార్టం నివేదికలో తేలింది. -
సల్మాన్ జైలు శిక్షపై షోయబ్ అక్తర్ కామెంట్
ఇస్లామాబాద్ : బాలీవుడ్ కండల నటుడు సల్మాన్ ఖాన్ జైలు శిక్షపై రావల్పిండి ఎక్స్‌ప్రెస్, పాకిస్తాన్ మాజీ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ ట్విటర్లో స్పందించారు. సల్మాన్ ఖాన్‌కు కృష్ణ జింకల వేట కేసులో శిక్ష పడటం పట్ల విచారం వ్యక్తం చేశారు. సల్మాన్‌కు ఐదేళ్ల శిక్ష విధించడం చాలా కఠినమని పేర్కొన్నారు. తన స్నేహితుడు సల్మాన్ ఖాన్‌కు ఐదు సంవత్సరాలు జైలు శిక్షపడటం చాలా బాధ కలిగిందని ట్విటర్ ద్వారా తెలిపారు. కానీ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని వెల్లడించారు. సల్మాన్ కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. త్వరలోనే సల్మాన్ తిరిగి వస్తాడని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. కృష్ణ జింకలను వేటాడినట్లు నిరూపితం కావడంతో జోథ్‌పూర్ కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ దేవ్ కుమార్ ఖత్రి గురువారం సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించిన సంగతి తెల్సిందే. -
సల్మాన్ ఖాన్ కేసు..10 ఆసక్తికర అంశాలు
జోధ్‌పూర్: కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ కండల నటుడు సల్మాన్ ఖాన్ దోషిగా తేలడంతో జోథ్‌పూర్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమాన విధించిన సంగతి తెల్సిందే. 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ మూవీ షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడాడని ధృవీకరించుకుని కోర్టు ఈ శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన 10 ఆసక్తికర అంశాలు 1. తుది తీర్పు వెలువడే సమయంలో కోర్టుకు సల్మాన్ ఖాన్ తనకు ఇష్టమైన నల్లటి చొక్కాలో వచ్చాడు. కోర్టు సల్మాన్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో ఆయన చెల్లెల్లు అల్విరా, అర్పితా కోర్టులో ఏడ్చారు. 2. సల్మాన్‌కు శిక్ష విధించిన వెంటనే జోథ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. 2006లో ఇదే జైలులో సల్మాన్ ఐదు రోజుల జైలు జీవితం గడిపాడు. ఇదే జైలులో అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆశారాం బాపు కూడా ఉన్నాడు. 3. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో సైఫ్ అలీ ఖాన్, సొనాలీ బెంద్రే, టబు, నీలం కొఠారీలను న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది. సల్మాన్ ఖాన్ జింకలను వేటాడే సమయంలో ప్రయాణించడానికి ఉపయోగించిన జిప్సీలోనే వీరు కూడా ఉన్నట్లు అభియోగాలు ఉన్నాయి. 4. జంతువులను ఇష్టపడి ప్రేమించే బిష్ణోయ్ తెగ ఉండే గ్రామ సమీపంలో సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకలను చంపినట్లు ప్రాసిక్యూషన్ కోర్టులో వాదించింది. 5. మొత్తంలో బిష్ణోయ్ గ్రామానికి చెందిన 28 మంది ఈ కేసులో సల్మాన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. తాము తుపాకీ శబ్దం విని తమ గుడిసెల్లో నుంచి పరుగెత్తుకుంటూ సంఘటనాస్థలానికి చేరుకున్నామని వారు తెలిపారు. 6.తాము బైక్‌లపై జిప్సీ వాహనాన్ని వెంబడించామని, కానీ అప్పటికే సల్మాన్ ఖాన్ పారియాడని, అప్పటికే అక్కడ కృష్ణ జింక మృతదేహం ఉందని వారు చెప్పారు. 7. ఈ కేసు న్యాయస్థానంలో సుమారు రెండు దశాబ్దాల పాటు నడిచింది. ఆ సమయంలో తన వద్ద ఎలాంటి తుపాకులు లేవని పలుమార్లు ఆయన వాదించారు. తన వద్ద ఒక ఎయిర్ గన్ మాత్రమే ఉందని, అదీ కూడా చంపే అంత ప్రమాదకరం కాదని గతంలో వాదించారు. అలాగే కుక్కలు దాడి చేయడం వల్ల జింకలు చనిపోయి ఉండవచ్చునని లేదా అతిగా తినడం వల్ల కూడా చనిపోయే అవకాశం ఉండవచ్చనని సల్మాన్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. 8. 2009లో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కృష్ణ జింకలను రక్షించానని, వాటికి అన్నం పెట్టానని సల్మాన్ చెప్పాడు. వివాదం అంతా అప్పటి నుంచే మొదలైందని సల్మాన్ ఆరోపించారు. 9. ఇండియాలోని పెద్ద సినిమా స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకరు. ప్రస్తుతం ఆయనపై 700 కోట్ల రూపాయల మేర సినిమా బిజినెస్ జరుగుతోంది. ఆయన నటిస్తున్న పెద్ద చిత్రాల్లో ఒక్క ‘రేస్3’ సినిమా మాత్రమే పూర్తైంది. మిగతా సినిమాలన్నీ డోలాయమానంలో ఉన్నాయి. 10. ముంబాయిలోని బాంద్రా సమీపంలో పుట్‌పాత్ నిద్రిస్తున్న వారి పైకి సల్మాన్ ఖాన్ కారు దూసుకెళ్లడంతో ఒకరు చనిపోయారు. పలువురు అవిటివారయ్యారు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం సేవించి ఉన్నారు. కారు నడిపింది సల్మాన్ ఖాన్నేని ఆధారాలు లభించకపోవడంతో ఆయనకు ఉపశమనం లభించింది. ఈ కేసును కొట్టివేస్తూ 2015 న్యాయస్థానం తీర్పివ్వడంతో సల్మాన్ బయటపడ్డారు. -
నేరాల నియంత్రణను గాలికొదిలేశారు!
- పలువురు ఎస్పీలు/కమిషనర్లపై ఉన్నతాధికారుల ఆగ్రహం - సున్నితమైన కేసులను వివాదాస్పదం చేస్తున్నారు.. - చిన్న జిల్లాల ఏర్పాటును అర్థం చేసుకోలేకపోతున్నారని అసంతృప్తి - పనితీరు మార్చుకోవాలని డీజీపీ ఆదేశం! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు మరింత సేవలు, పాలన సౌలభ్యంకోసం ప్రభుత్వం జిల్లాలను పునర్విభజించింది. అయితే ఈ అంశాన్ని పట్టించుకోవడంలో పలువురు ఎస్పీలు/ కమిషనర్లు విఫలమవుతున్నారని పోలీస్ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొత్తగా కమిషనర్లు, ఎస్పీలు అయిన అధికారులు కేవలం స్వంత పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని, నేరాల నియంత్రణను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రెండు ఘటనలు పోలీస్ బాస్‌లను తీవ్ర ఒత్తిడికి గురిచేసినట్టు తెలుస్తోంది. భూపాలపల్లిలో జరిగిన దుప్పులవేట కేసులో సరైన రీతిలో సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేయలేకపోయారని, దీనితో కేసులో రాజకీయ నేతలుండటం వల్లే కేసు పక్కదారి పట్టించారన్న ఆరోపణలకు ఆస్కారం ఇచ్చినట్లయిందని భావిస్తున్నారు. దీనితో జిల్లా బాధ్యులుగా ఉన్న అధికారులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులను దగ్గరుండి పర్యవేక్షించాల్సింది పోయి, పట్టించుకోకుండా ఉన్నారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో డీజీపీ అనురాగ్‌శర్మకు పలు రాజకీయ పార్టీల నేతలు ఫిర్యాదు కూడా చేశారు. పనితీరు సరిగ్గా ఉంటే ఇలాంటి ఆరోపణలు రావని, ఇక నుంచి సరైన రీతిలో స్పందించాలని డీజీపీ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మంథని కేసులో వైఫల్యం... మంథనిలో జరిగిన మధుకర్ మృతి వ్యవహారంలో కమిషనరేట్ ఉన్నతాధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం వల్లే విషయం వివాదాస్పదమైందని ఉన్నతాధికా రులు భావిస్తున్నారు. ఘటన జరిగి.. పోస్టుమార్టం అయిన తర్వాత ఆందోళనలు చోటు చేసుకోవడం, రాజకీయంగా కేసులో ఒత్తిడి రావడం.. తదితర అంశాలను పట్టించుకోకుండా కమిషనరేట్ అధికారులు వ్యవహరించారని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. మధుకర్ మృతి కేసులో సంఘటన స్థలానికి కూడా కమిషనర్ వెళ్లకపోవడం, పైగా కొత్తగా విధుల్లో చేరిన ఏసీపీపైనే భారం వేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై డీజీపీ అనురాగ్ శర్మ ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో డీజీపీ స్వయంగా కమిషనర్‌కు ఆదేశాలు జారీచేశారు. బాధితుడి కుటుంబాన్ని కలసి విచారణపై నమ్మకం కల్గించేలా దైర్యం చెప్పాలని సూచించడంతో అప్పటికప్పుడు కమిషనర్, మధుకర్ గ్రామానికి వెళ్లినట్టు తెలిసింది. కేవలం ప్రచారం మాత్రమే కాకుండా పనితీరులో కూడా ప్రతిభ చూపాలని ఉన్నతాధికారులు ఎస్పీలు/కమిషనర్లకు సూచించినట్టు తెలిసింది. పర్యవేక్షణ లోపమే.. ఏ జిల్లాలో అయినా సున్నితమైన కేసులు, వివిధ వర్గాల మధ్య ఘర్షణలు జరిగే కేసులు ఉన్నట్టయితే వెంటనే సంబంధిత ఎస్పీ/కమిషనర్ ఆ విషయాన్ని డీఐజీ, ఐజీ, డీజీపీకి చేరవేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న చాలా మంది ఎస్పీలు, కమిషనర్లు ఏ విషయాన్ని కూడా తగిన పద్ధతిలో ఉన్నతాధికారులకు చెప్పడం లేదని డీజీపీ కార్యాలయంలో చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారులు కూడా పెద్దగా జిల్లాలను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని, ఇక నుంచి ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని డీజీపీ ఆదేశించినట్టు తెలిసింది. -
టీఆర్ఎస్ నాయకులే అసలు ముద్దాయిలు
జింకల వేట కేసు దర్యాప్తుపై కిషన్‌రెడ్డి ఫైర్ సాక్షి, హైదరాబాద్: మహదేవ్పూర్ జింకల వేట కేసులో అధికార పార్టీ నాయకులే అసలు ముద్దాయిలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నాయకులు ఉన్నందు వల్లే కేసు దర్యాప్తును పోలీసులు పక్క దారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అటవీ అధికారులపై తుపాకులతో దాడి చేసినా హత్యానేరం కేసు నమోదు చేయలేదంటే కేసు దర్యాప్తుపై విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు. ఘటన ప్రాంతంలో విమానం టికెట్లు, ఆధార్‌కార్డులు లభించినప్పటికీ సదరు వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసులో నిందితుడైన టీఆర్ఎస్ నాయకుడు అక్బర్‌ఖాన్.. మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌లో తిరుగుతున్నా పోలీసులు అతన్ని అరెస్ట్ చేయకపోవటం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించాలని, లేని పక్షంలో తామే హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు వెంకట్‌రెడ్డి, పుష్పలీల పాల్గొన్నారు. -
అక్బర్‌ఖాన్ లొంగుబాటు హైడ్రామా
విలేకరులను బ్లాక్మెయిల్ చేయడానికి యత్నం మహదేవపూర్(మంథని): మహదేవపూర్ అడవుల్లో జరిగిన దుప్పుల వేట కేసులో ప్రధాన నిందితుడు, టీఆర్ఎస్ నాయకుడు అక్బర్‌ఖాన్ శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లొంగుబాటు హైడ్రా మాను రక్తి కట్టించాడు. వేటగాళ్లను అరెస్టు చేయాలని టీవీలో వాయిస్ ఇచ్చిన ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు వార్తలు రాసిన విలేకరులను ఫోన్లో బ్లాక్మెయిల్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మంథనిలో శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ రాష్ట్ర మంత్రి కాన్వాయిలో ఉన్న మంథనికి చెందిన నాయకుడి వాహనంలో అక్బర్‌ఖాన్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, శనివారం మంథని కోర్టులో లొంగిపోతాడని, జడ్జి ఎదుట ఇచ్చే వాంగ్మూలంలో వేటగాళ్ల ముఠాలో ఒక విలేకరి కూడా ఉన్నట్లు చెబుతాడని ప్రచారం జరిగింది. ఉదయం 9 గంటలకు కాటారం పోలీసుల ఎదుట అక్బర్‌ఖాన్ లొంగిపోతాడని కొందరు, మధ్యాహ్నం 12 గంటలకు భూపాలపల్లి ఎస్పీ ఎదుట అని మరికొందరు, మధ్యాహ్నం 3 గంటలకు మంథని కోర్టులో లొంగిపో తాడని అక్బర్ఖాన్కు సంబంధించిన వ్యక్తులు ప్రచారం చేశారు. ఇలా రోజంతా అక్బర్‌ఖాన్ లొంగుబాటు హైడ్రామా చివరకు అబద్ధమని తేలింది. అయితే, అక్బర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం అందింది. అసలు నిందితులు విదేశాలకు.. భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లో జరిగిన దుప్పుల వేట కేసులో అటవీశాఖ.. పోలీసు అధికారుల అలసత్యంతో నిందితులు దేశం దాటారనే ప్రచారం సాగుతోంది. మార్చి 19న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లో ఐదు దుప్పులను వేటాడిన హంటింగ్ మాఫియా 20వ తేదీ వరకు మండల కేంద్రంలోనే ఉన్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో ‘ఇంటి వద్ద ఉన్నప్పుడు ఊరుకుని.. ఇప్పుడు ఇంటర్ పోల్ సాయం’అడగాల్సిన దుస్థితి ఏర్పడిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి మార్చి 18న మహదేవపూర్‌కు చేరుకున్న వేటగాళ్ల బృందం అక్బర్ఖాన్కు చెం దిన పార్టీ కార్యాలయంలో విందు చేసుకుని, పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ నుంచి షికారు సత్యంను పిలిపించుకుని 19న దర్జాగా మహదేవపూర్, పలిమెల అడవుల్లో వేట సాగించారు. -
పులి చర్మం కోసం రూ.10 లక్షల చెక్కు
- సంచిలో పులి చర్మం? - విదేశాలకు తరలిస్తున్నట్లు అనుమానం - ఛత్తీస్‌గఢ్ వ్యాపారి నుంచి కొనుగోలు - దుప్పుల వేట కేసులో కొత్త కోణం సాక్షి, భూపాలపల్లి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దుప్పులవేట కేసులో మరో దారుణం చోటు చేసుకున్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దుప్పులను వేటాడిన నిందితులు విదేశాలకు తరలించేందుకు పులిచర్మాన్ని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యాపారి నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అటవీ శాఖ అధికారులు దాడి చేసిన తర్వాత చాకచ క్యంగా ఈ పులిచర్మాన్ని తప్పించినట్లు తెలుస్తోంది. కేసు విచారణలో పక్కదారి పట్టిన పలు అంశాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. గన్నీ బ్యాగులో పులి చర్మం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి వద్ద ఈ నెల 19న రాత్రి అటవీశాఖ అధికారులు దాడి చేయగా దుప్పులను వేటాడిన నిందితులు పారిపోయారు. సంఘటనా స్థలంలో టాటా ఇండికా విస్టా కారు, రెండు దుప్పు ల కళేబరాలు, ఖాళీ బ్యాంకు చెక్కు, ఫజల్ మహ్మద్ ఖాన్‌కు చెందిన ఆధార్‌కార్డు, కారు రిపేరు చేయిం చిన రసీదు, కత్తి, ఖురాన్ వంటి వస్తువులతోపాటు రూ.10 లక్షల విలువైన సంతకం చేసిన చెక్కు, ఫ్లైట్æ టికెట్, మొబైల్ ఫోన్లు లభించినట్లు తెలుస్తోంది. గ్రామస్తులందరూ చూస్తుండగానే టాటా ఇండికా విస్టా కారు నుంచి ఓ గన్నీ సంచిని ఏ–4 నిందితుడు అక్బర్‌ఖాన్ తీసినట్లు తెలు స్తోంది. ఈ సంచిలో ఏముందనే ప్రశ్న వారం రోజు లుగా అంతు చిక్కకుండా ఉంది. తాజాగా విశ్వసనీ య వర్గాల సమాచారం ప్రకారం ఈ గన్నీ సంచిలో పులిచర్మం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయ జంతువైన పెద్దపులిని చంపడం, చర్మాన్ని, శరీరభాగాలతో వ్యాపారం చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. అందువల్లే కేసును పక్కకు పెట్టినట్లు సందేహాలున్నాయి. మంథని కోర్టుకు ముగ్గురు వేటగాళ్లు మహదేవపూర్(మంథని): దుప్పులవేట కేసులో కరీంనగర్ జైలులో ఉన్న ముగ్గురు వేటగాళ్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకొని గురువారం మంథని కోర్టులో హాజరుపరిచారు. అక్బర్ ఖాన్ పరారీలో ఉండగా పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ వాసి షికారు సత్యం, మహదేవపూర్వాసి అస్రార్ ఖురేషీ, ఖరీముల్లాఖాన్లను పోలీసులు మార్చి 24న అరెస్టు చేసి కోర్టులో హాజ రుపర్చగా 13 రోజుల రిమాండ్ విధించిన విషయం విదితమే. -
లొంగుబాటలో అక్బర్‌ఖాన్..?
మహదేవపూర్: జయశంకర్ జిల్లా మహదేవపూర్ అడవుల్లో జరిగిన దుప్పుల వేటకేసులో కీలకవ్యక్తి, టీఆర్ఎస్ అక్బర్‌ఖాన్ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి సిద్ధమైన ట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు లొంగిపోగా, అక్బర్‌ఖాన్ పరారీలో ఉన్నాడు. అలాగే, ఫజల్ అహ్మద్ ఖాన్, జలాల్, మున్నా, మొబిన్, గట్టయ్యల తోపాటు మరికొందరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోపక్క లొంగుబాటు కోసం అక్బర్ భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు హసీనాభానుతోపాటు కుమారుడు, కుమార్తె, బావమరిదిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అక్బర్ ఒకటి రెండు రోజుల్లో లొంగిపోయే అవకాశమున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో అక్బర్ అనుచరులు? దుప్పుల వేట కేసులో ప్రధాన నింది తుడైన అక్బర్‌ఖాన్ అనుచరులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమా చారం. కరీంనగర్లో ఒకరిని, హైదరాబాద్‌లో మరో సన్నిహితుడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వారు ఇచ్చిన సమాచా రంతో అక్బర్‌ఖాన్‌ను పట్టుకునేందుకు ప్రయత్ని స్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహాల్లో కీలక భాగస్వామిగా ఉండే గాడ్‌ఫాదర్ వద్దకు అక్బర్ చేరుకుని అతడి ద్వారా లొంగుబాటుకు యత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వేటపై సీఎం ఆరా..! దుప్పుల వేట సంఘటనపై సహచర మంత్రుల వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీసినట్లు సమా చారం. ఈ వేటలో పొల్గొన్న వారి గురించి మంత్రి ఈటల రాజేందర్, స్పీకర్ మధుసూదనా చారి ద్వారా వాకబు చేసినట్లు తెలిసింది. టీఆర్ఎస్ నుంచి అక్బర్‌ఖాన్‌ను సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధమయినట్లు పార్టీ వర్గాల సమాచా రం. దుప్పుల వేట కేసులో బుధవారం అటవీ శాఖ అధికారులు కిష్టారావుపేటలో రహస్య విచారణ నిర్వహించారు. రెండు దుప్పుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. -
ఇన్స్పెక్టర్పై వేటు?
♦ వేటగాళ్లకు సహకరించినందుకు చర్యలు ♦ అటవీశాఖ ఇచ్చిన ఫిర్యాదులోని పేర్లు ♦ ఎఫ్ఐఆర్లో నమోదుకాని వైనం ♦ కోర్టు వరకు వెంట వచ్చిన ఏ4ను అరెస్టు చేయని పోలీసులు మహదేవపూర్ (మంథని): దుప్పుల వేట కేసులో వేటగాళ్లకు సహకరిస్తున్నాడన్న అభియోగాలపైన పోలీసు ఉన్నతాధికారులు ఓ సీఐపై వేటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా లేకపోవడం.. వేటగాళ్లకు సహకరించినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ కేసు విచారణ నుంచి ఓ సీఐని తప్పించడంతో పాటు వేటుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. దుప్పుల వేట ఘటనలో రేంజర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ఫజల్ మహ్మద్‌ఖాన్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చకపోగా.. గుర్తు తెలియని ఐదుగురుపై కేసు నమోదు చేశాడని, వేటలో పాల్గొన్న కరీముల్లాఖాన్, అస్రార్ ఖురేషీలతో పాటు షికారు సత్తయ్యను ఆయుధంతో సహా పోలీసుస్టేషన్లో అప్పగించిన అక్బర్‌ఖాన్‌ను అరెస్టు చేయలేదని సీఐపై ఆరోపణలున్నాయి. అలాగే, గత శుక్రవారం రాత్రి లొంగిపోయిన వేటగాళ్లను మంథని జడ్జి ఎదుట ప్రవేశపెట్టిన సమయంలోనూ వెంట ఉన్న అక్బర్‌ఖాన్‌ను అరెస్టు చేయకపోవడాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. వేటకు నాయకత్వం వహించింది అక్బర్‌ఖాన్, మున్నాలేనని విచారణలో తెలడంతో అక్బర్ఖాన్కు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ముగ్గురు వేటగాళ్లను కోర్టులో హాజరుపర్చేందుకు వెళ్లిన వాహనంలో ఒక ఏఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్ల వెంట ఏ4గా నమోదైన నిందితుడు అక్బర్‌ఖాన్ సైతం ప్రయాణించినట్లు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వారిపైనా చర్యకు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. వన్యప్రాణులను వధించిన వేటగాళ్ల కన్నా ముందు వారికి సహకరించిన పోలీసు, అటవీశాఖ అధికారులకు శిక్షలు పడే అవకాశాలున్నట్లు సమాచారం. -
దుప్పులను వేటాడింది మేమే...
⇒ లొంగిపోయిన వేటగాళ్లు...ముగ్గురి రిమాండ్ ⇒ కరీంనగర్ సబ్ జైలుకు తరలింపు ⇒ పరారైన నాలుగో నిందితుడు టీఆర్ఎస్ నేత అక్బర్‌ఖాన్ ⇒ నాలుగు రోజులుగా పట్టించుకోని పోలీసులు సాక్షి, భూపాలపల్లి/మంథని: మహదేవపూర్ అడవుల్లో దుప్పులను వేటాడింది తామేనంటూ ముగ్గురు నిందితులు శుక్రవారం సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహదేవ పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రభాను ఎదుట ఈనెల 24న లొంగిపోగా, వీరిని అదేరోజు రాత్రి 11 గంటలకు పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి నాగేశ్వర రావు ఎదుట హాజరుపరిచారు. అనంతరం కరీంనగర్ సబ్‌జైలుకు తరలించారు. కోర్టుకు సమర్పించిన రిమాండు పత్రంలో మొత్తం నలు గురిని నిందితులుగా పేర్కొన్నారు. ఏ–1గా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చెందిన నలువాల సత్యనారాయణ అలి యాస్ సత్తెన్న(55), ఏ–2గా జయశంకర్ జిల్లా మహ దేవపూర్ మండలం ఖాన్పూర్కు చెందిన మహ్మద్ ఖలీముల్లాఖాన్(25), ఏ–3గా జయ శంకర్ జిల్లా మహదేవపూర్ మండలం ఖాన్పూర్ కు చెందిన అస్రార్ అహ్మద్ ఖురేషీ(28), ఏ–4గా మహదేవపూర్ మండలానికి చెందిన టీఆర్ఎస్ నేత మహ్మద్ అక్బర్‌ఖాన్‌ను పేర్కొన్నారు. అక్బర్ పరారీలో ఉన్నాడు. రెండు లైసెన్స్డ్ తుపాకులు.. నిందితుల్లో ఇద్దరి వద్ద లైసెన్స్డ్ తుపాకులు ఉన్నాయి. సత్తెన్న తుపాకీతోపాటు 150 తుటా లను పోలీసులకు అప్పగించాడు. అక్బర్‌కు చెందిన లైసెన్సు తుపాకీ వేట కొనసాగినప్పుడు తన వెంట ఉన్నట్లు రిమాండ్ డైరీలో పేర్కొన్నా రు. ఈ ప్రాంతంలో వేటాడేందుకు వచ్చే వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు అక్బర్ మీద ఉన్నాయి. నిందితులు అక్బర్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌లో ఈనెల 19న సమావేశమయ్యారు. అక్కడ మద్యం సేవించిన అనంతరం ఈ ముగ్గురి తోపాటు మరో ఇద్దరు కారులో వన్యప్రా ణులను వేటాడేందుకు సర్వాయిపేట వైపునకు వెళ్లినట్లుగా పేర్కొన్నారు. అక్బర్ 4 రోజులు దర్జాగా తిరిగి నట్లు స్థానికులు చెబుతున్నారు. కేసులో కీలకంగా మారిన అక్బర్ ను అరెస్టు చేస్తే పెద్ద తలకాయల గుట్టురట్టయ్యే ఆస్కారముండేది. కేసులో ప్రధానపాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్న వ్యక్తులను తప్పించేం దుకు విచారణ మంద కొడిగా సాగిస్తున్నారనే ఆరోపణ లున్నాయి. వేట వెనుక మంత్రుల హస్తం దుప్పుల వేట కేసులో రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులకు సంబంధముందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మహదేవపూర్ జెడ్పీ టీసీ సభ్యురాలు హసీనాభాను భర్త, టీఆర్ఎస్ నేత అక్బర్‌ఖాన్ నిందితుడిగా పేర్కొన్న నేపథ్యం లో ఆ మంత్రుల పాత్రా ఉందని అంటున్నారు. వేటకు సంబంధించి వాస్తవాలు సేకరించేందుకు అటవీశాఖ విజిలెన్స్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ శ్రీనివాస్ మహదేవపూర్ అటవీ ప్రాంతంలో వస్తున్నట్లు సమాచారం. స్థానికులు, అటవీశాఖ, పోలీసుల నుంచి వివరాలు రాబట్టనున్నారు. నన్ను బలిపశువును చేస్తున్నారు దుప్పులవేట కేసులో ఏ –1 ఆగ్రహం దుప్పులవేట కేసులో ఏ–1 నిందితుడిగా నలువాల సత్యనారాయణ అలియాస్ సత్తెన్న అప్రూవర్‌గా మారేందుకు ప్రయత్నించాడు. ప్రధాన నిందితులను తప్పించేందుకు తనను బలిపశువు చేస్తున్నారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వేట ఘటనపై మీడియాలో కథనాలు రావడం, అసెంబ్లీలో చర్చకు రావడం, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించిన నేపథ్యంలో సత్య నారా యణ, ఖలీముల్లాఖాన్, అస్రార్ అహ్మద్ ఖురేషీ లు మహదేవపూర్ పోలీసుస్టేషన్లో లొంగిపోయారు. సత్య నారాయణను ఏ1గా, మిగిలిన ఇద్దరిని ఏ 2, ఏ 3లుగా పేర్కొంటూ తొలుత రిమాండ్ డైరీ రూపొం దించినట్లు సమాచారం. అక్బర్‌ఖాన్‌ను వదిలి తనను ఏ1గా ఎలా పేర్కొంటారని సత్యనా రాయణ ఎదురు తిరిగి నట్లు తెలుస్తోంది. దీంతో అసలుకే ఎసరు వస్తుందని అక్బర్‌ను ఏ4గా పేర్కొన్నట్లు తెలిసింది. అక్బర్ పోలీసు స్టేషన్ నుంచి వెళ్లిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్ పూర్తి చేసి శుక్రవారం రాత్రి మిగిలినవారిని జడ్జి ఎదుట హాజరుపరిచారు.