లొంగుబాటలో అక్బర్‌ఖాన్..?
మహదేవపూర్: జయశంకర్ జిల్లా మహదేవపూర్ అడవుల్లో జరిగిన దుప్పుల వేటకేసులో కీలకవ్యక్తి, టీఆర్‌ఎస్ అక్బర్‌ఖాన్ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి సిద్ధమైన ట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు లొంగిపోగా, అక్బర్‌ఖాన్ పరారీలో ఉన్నాడు. అలాగే, ఫజల్ అహ్మద్ ఖాన్, జలాల్, మున్నా, మొబిన్, గట్టయ్యల తోపాటు మరికొందరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోపక్క లొంగుబాటు కోసం అక్బర్ భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు హసీనాభానుతోపాటు కుమారుడు, కుమార్తె, బావమరిదిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అక్బర్ ఒకటి రెండు రోజుల్లో లొంగిపోయే అవకాశమున్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో అక్బర్ అనుచరులు?
దుప్పుల వేట కేసులో ప్రధాన నింది తుడైన అక్బర్‌ఖాన్ అనుచరులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమా చారం. కరీంనగర్‌లో ఒకరిని, హైదరాబాద్‌లో మరో సన్నిహితుడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వారు ఇచ్చిన సమాచా రంతో అక్బర్‌ఖాన్‌ను పట్టుకునేందుకు ప్రయత్ని స్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహాల్లో కీలక భాగస్వామిగా ఉండే గాడ్‌ఫాదర్ వద్దకు అక్బర్ చేరుకుని అతడి ద్వారా లొంగుబాటుకు యత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
వేటపై సీఎం ఆరా..!
దుప్పుల వేట సంఘటనపై సహచర మంత్రుల వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీసినట్లు సమా చారం. ఈ వేటలో పొల్గొన్న వారి గురించి మంత్రి ఈటల రాజేందర్, స్పీకర్ మధుసూదనా చారి ద్వారా వాకబు చేసినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ నుంచి అక్బర్‌ఖాన్‌ను సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధమయినట్లు పార్టీ వర్గాల సమాచా రం. దుప్పుల వేట కేసులో బుధవారం అటవీ శాఖ అధికారులు కిష్టారావుపేటలో రహస్య విచారణ నిర్వహించారు. రెండు దుప్పుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు.