Akbarkhan
-
అక్బర్‌ఖాన్ లొంగుబాటు హైడ్రామా
విలేకరులను బ్లాక్మెయిల్ చేయడానికి యత్నం మహదేవపూర్(మంథని): మహదేవపూర్ అడవుల్లో జరిగిన దుప్పుల వేట కేసులో ప్రధాన నిందితుడు, టీఆర్ఎస్ నాయకుడు అక్బర్‌ఖాన్ శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లొంగుబాటు హైడ్రా మాను రక్తి కట్టించాడు. వేటగాళ్లను అరెస్టు చేయాలని టీవీలో వాయిస్ ఇచ్చిన ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు వార్తలు రాసిన విలేకరులను ఫోన్లో బ్లాక్మెయిల్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మంథనిలో శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ రాష్ట్ర మంత్రి కాన్వాయిలో ఉన్న మంథనికి చెందిన నాయకుడి వాహనంలో అక్బర్‌ఖాన్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, శనివారం మంథని కోర్టులో లొంగిపోతాడని, జడ్జి ఎదుట ఇచ్చే వాంగ్మూలంలో వేటగాళ్ల ముఠాలో ఒక విలేకరి కూడా ఉన్నట్లు చెబుతాడని ప్రచారం జరిగింది. ఉదయం 9 గంటలకు కాటారం పోలీసుల ఎదుట అక్బర్‌ఖాన్ లొంగిపోతాడని కొందరు, మధ్యాహ్నం 12 గంటలకు భూపాలపల్లి ఎస్పీ ఎదుట అని మరికొందరు, మధ్యాహ్నం 3 గంటలకు మంథని కోర్టులో లొంగిపో తాడని అక్బర్ఖాన్కు సంబంధించిన వ్యక్తులు ప్రచారం చేశారు. ఇలా రోజంతా అక్బర్‌ఖాన్ లొంగుబాటు హైడ్రామా చివరకు అబద్ధమని తేలింది. అయితే, అక్బర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం అందింది. అసలు నిందితులు విదేశాలకు.. భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లో జరిగిన దుప్పుల వేట కేసులో అటవీశాఖ.. పోలీసు అధికారుల అలసత్యంతో నిందితులు దేశం దాటారనే ప్రచారం సాగుతోంది. మార్చి 19న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లో ఐదు దుప్పులను వేటాడిన హంటింగ్ మాఫియా 20వ తేదీ వరకు మండల కేంద్రంలోనే ఉన్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో ‘ఇంటి వద్ద ఉన్నప్పుడు ఊరుకుని.. ఇప్పుడు ఇంటర్ పోల్ సాయం’అడగాల్సిన దుస్థితి ఏర్పడిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి మార్చి 18న మహదేవపూర్‌కు చేరుకున్న వేటగాళ్ల బృందం అక్బర్ఖాన్కు చెం దిన పార్టీ కార్యాలయంలో విందు చేసుకుని, పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ నుంచి షికారు సత్యంను పిలిపించుకుని 19న దర్జాగా మహదేవపూర్, పలిమెల అడవుల్లో వేట సాగించారు. -
లొంగుబాటలో అక్బర్‌ఖాన్..?
మహదేవపూర్: జయశంకర్ జిల్లా మహదేవపూర్ అడవుల్లో జరిగిన దుప్పుల వేటకేసులో కీలకవ్యక్తి, టీఆర్ఎస్ అక్బర్‌ఖాన్ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి సిద్ధమైన ట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు లొంగిపోగా, అక్బర్‌ఖాన్ పరారీలో ఉన్నాడు. అలాగే, ఫజల్ అహ్మద్ ఖాన్, జలాల్, మున్నా, మొబిన్, గట్టయ్యల తోపాటు మరికొందరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోపక్క లొంగుబాటు కోసం అక్బర్ భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు హసీనాభానుతోపాటు కుమారుడు, కుమార్తె, బావమరిదిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అక్బర్ ఒకటి రెండు రోజుల్లో లొంగిపోయే అవకాశమున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో అక్బర్ అనుచరులు? దుప్పుల వేట కేసులో ప్రధాన నింది తుడైన అక్బర్‌ఖాన్ అనుచరులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమా చారం. కరీంనగర్లో ఒకరిని, హైదరాబాద్‌లో మరో సన్నిహితుడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వారు ఇచ్చిన సమాచా రంతో అక్బర్‌ఖాన్‌ను పట్టుకునేందుకు ప్రయత్ని స్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహాల్లో కీలక భాగస్వామిగా ఉండే గాడ్‌ఫాదర్ వద్దకు అక్బర్ చేరుకుని అతడి ద్వారా లొంగుబాటుకు యత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వేటపై సీఎం ఆరా..! దుప్పుల వేట సంఘటనపై సహచర మంత్రుల వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీసినట్లు సమా చారం. ఈ వేటలో పొల్గొన్న వారి గురించి మంత్రి ఈటల రాజేందర్, స్పీకర్ మధుసూదనా చారి ద్వారా వాకబు చేసినట్లు తెలిసింది. టీఆర్ఎస్ నుంచి అక్బర్‌ఖాన్‌ను సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధమయినట్లు పార్టీ వర్గాల సమాచా రం. దుప్పుల వేట కేసులో బుధవారం అటవీ శాఖ అధికారులు కిష్టారావుపేటలో రహస్య విచారణ నిర్వహించారు. రెండు దుప్పుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు.