
ఇంతవరకు మనం చాలా వైరల్ వీడియోలు చూశాం. టూరిస్ట్‌లపై దాడిచేసిన పులలకు సంబంధించిన వీడియోలు. టూరిస్ట్ బండి గుంతలో పడిపోతే తీసిన వీడియోలను చూశాం. కానీ వీటన్నింటికి భిన్నంగా బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా స్వయంగా వీడియో తీసిన పులి వేటాడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
(చదవండి: టెస్లా కారులో పుట్టిన తొలి పాపగా రికార్డు!!)
అసలు విషయంలోకెళ్లితే...బాలివుడ్ నటుడు రణదీప్ కపూర్ మధ్యప్రదేశ్‌లోని సాత్పురా టైగర్ రిజర్వ్‌లో పులి ఆవుని వేటాడుతున్న వీడియోని చిత్రీకరించాడు. డిస్కవరీ ఛానెల్స్‌లో పులి వేటాడుతున్న దృశ్యాలు చూసినప్పుడే శరీరం గగ్గురపాటుకి గురవుతుంది. అలాంటిది ప్రత్యక్ష్యగా రణదీప్ చూడటమే కాక వీడియో తీశాడు. అంతేకాదు ఆ వీడియోకి "ఇది నా పులి వేట" అనే క్యాప్షన్ జోడించి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఐఎఫఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ పులి ఆవుని పట్టుకోవడంతో విజయవంతమైందా అంటూ ట్వీట్ చేశారు. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి.
(చదవండి: భారత్‌లో జీరో రూపాయి నోటు ఉందని మీకు తెలుసా!...)
My first tiger hunt .. #SatpuraTigerReserve pic.twitter.com/J9iWp9vRlC
— Randeep Hooda (@RandeepHooda) December 19, 2021