చేపల వేట సరదా ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన దామరచర్ల మండలం అడవిదేవులపల్లిలో చోటు చేసుకుంది.
– నదిలో పడి యువకుడి మృతి
– దామరచర్ల మండల పరిధిలో ఘటన
దామరచర్ల
చేపల వేట సరదా ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన దామరచర్ల మండలం అడవిదేవులపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని తిమ్మాపురంకు చెందిన ధనావత్ జవహర్‌లాల్(23) కొందరు గ్రామస్తులతో కలిసి మంగళవారం అడవిదేవులపల్లి టెయిల్‌పాండ్ సమీపంలోని కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో జవహర్‌లాల్ పట్టుతప్పి నదిలో పడి పోయాడు. దీనిని గుర్తించిన తోడుగా వెళ్లినవారు బాధితుడిని నది నంచి బయటకు తీశారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.