రిసార్టు ముసుగులో కొనసాగుతున్న అటవీ జంతువుల వేటపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చట్టానికి ఎవరూ అతీతులు కాదని, నిజం నిగ్గు తేల్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రిసార్టులు, ఫాం హౌస్‌లలో జరిగే కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచాలని సిద్దిపేట సీపీ శివకుమార్‌ను ఆదేశించారు. ఇదే అంశంపై అటవీ శాఖ మంత్రి జోగు రామన్న కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. అటవీ జంతువులను ఎన్‌క్లోజర్స్ పెట్టి ఎలా బంధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.