ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కన్నౌజ్ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. సీతాపూర్‌లో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌కు చేరుకోవడం ప్రారంభించారు. నగరంలోని మెథడిస్ట్ చర్చి స్కూల్‌లో జిల్లా యంత్రాంగం గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా మోడల్ పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. బహ్రైచ్ లోక్‌సభ స్థానంలో మొత్తం 880 పోలింగ్ కేంద్రాలు, 1885 బూత్‌లను ఏర్పాటు చేశారు. నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల్లో షాజహాన్‌పూర్, ఖేరీ, ధౌరహర లోక్‌సభ స్థానాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఈ మూడు స్థానాల్లో మొత్తం 33 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీనితో పాటు దాద్రాల్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా ఓటింగ్ మొదలయ్యింది. ఈ ఉప ఎన్నికలో 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్‌కు ముందు అన్ని బూత్‌లలో మాక్‌పోల్ నిర్వహించారు. అనంతరం ఓటింగ్ ప్రారంభమైంది.
యూపీలోని 13 స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో మొత్తం 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎయిర్ అంబులెన్స్, హెలికాప్టర్ కూడా అందుబాటులో ఉంచామని సీఈవో రిన్వా తెలిపారు. ఈ హెలికాప్టర్ లొకేషన్ కాన్పూర్‌లో, ఎయిర్ అంబులెన్స్ లొకేషన్ లక్నోలో ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment