నవంబర్ 5 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల గురించి తెలంగాణ కేబినెట్లో చర్చించారు.
హైదరాబాద్: నవంబర్ 5 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల గురించి తెలంగాణ కేబినెట్లో చర్చించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశంలో కీలక విషయాల గురించి చర్చించడంతో పాటు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణలో తాజా విద్యుత్ సరఫరా పరిస్థితిపై కేసీఆర్ చర్చించారు. విద్యుత్ పరిస్థితిపై వాస్తవ నివేదికను అధికారులు కేబినెట్ ముందుంచారు. రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే డైరెక్టరేట్ ఆఫ్ స్టాటిస్టికల్ సంస్ధ ఏర్పాటుకు అంగీకరించింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఆధునీకరణకు నిధులు మంజూరు చేసింది.