తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆలస్యంగా వచ్చారు. దీంతో కేబినెట్ సమావేశం ఆలస్యంగా మొదలైంది. నవంబర్ 5 నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలతో పాటు పలు కీలక విషయాలను కేబినెట్లో చర్చించే అవకాశముంది.