న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో శనివారం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈ నెల 16 వ తేదీన నిర్వహించనున్నారు. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో శనివారం జరిగిన ఉప ఎన్నికలు ఉదయం 7 గంటలకు ఆరంభమయ్యాయి. దేశం మొత్తం మీద 3 లోక్సభ, 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించారు. అస్సాంలో 70 శాతం ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోగా, సిక్కింలో 79 శాతంపైగా పోలింగ్ శాతం నమోదైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 50శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో మెదక్ లోక్సభ, ఆంధ్రప్రదేశ్లో నందిగామ అసెంబ్లీ స్థానాలకు ఈ రోజే ఉప ఎన్నికలు జరిగాయి.
మెదక్ లోక్ సభకు 65 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ నెల 16 వ తేదీన పోలింగ్ జరిగిన స్థానాలకు ఎన్నికల లెక్కింపు నిర్వహిస్తారు.ఇప్పటివరకూ ఈశాన్య రాష్ట్రాల్లో పోలింగ్ మాత్రమే ముగిసినట్లు తెలుస్తోంది.