సెప్టెంబర్ ఒకటి నుంచి పోలో సీజన్
ఇండియన్ పోలో అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 22 వరకు రాష్ట్రంలో పోలో పోటీలు జరుగనున్నాయి. సికింద్రాబాద్‌లోని పోలో గ్రౌండ్‌లో జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశంలోని అత్యుత్తమ జట్లతో పాటు ప్రపంచ దేశాల నుంచి ఆటగాళ్లు రానున్నారని ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ మునీష్ శైబల్ పేర్కొన్నారు. సోమవారం తిరుమలగిరిలోని 554వ బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 దశల్లో జరిగే ఈ పోటీలు మొదట ఆగస్టు 15 నుంచి 31వరకు బెంగళూర్‌లో జరుగుతాయని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 1 నుంచి 22వరకు హైద్రాబాద్, సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 6 వరకు జైపూర్, అక్టోబర్ 7 నుంచి 13 వరకు నొయిడా, అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 8 వరకు ఢిల్లీ (ఐపీఏ చాంపియన్‌షిప్ కలిపి), డిసెంబర్ 11 నుంచి 31వరకు జోధ్‌పూర్, కోల్‌కతాల్లో, డిసెంబర్ 30 నుంచి ఏప్రిల్ 5వరకు జైపూర్, ఫిబ్రవరి 2 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీ, మార్చి 11 నుంచి ఏప్రిల్ 5వరకు ముంబై, ఏప్రిల్ 7వ తేది నుంచి 20 వరకు బెంగళూర్, సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు జైపూర్‌లో పోలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రీడల్లో గెలుపొందిన వారికి ప్రిన్స్‌ఆఫ్ బేరార్ కప్, బైసన్ కప్, ఆర్మీ కమాండర్స్ కప్ అందజే స్తారని ఆయన తెలిపారు.