కొత్త సినిమా షురూ  | Nandamuri Kalyan Ram new film launched with a pooja ceremony | Sakshi
Sakshi News home page

కొత్త సినిమా షురూ 

Published Sat, Oct 21 2023 12:05 AM | Last Updated on Sat, Oct 21 2023 12:05 AM

Nandamuri Kalyan Ram new film launched with a pooja ceremony - Sakshi

సునీల్‌ బలుసు, విజయశాంతి, కల్యాణ్‌ రామ్, సయీ మంజ్రేకర్‌

కల్యాణ్‌ రామ్‌ హీరోగా కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది.

ముహూర్తపు సన్నివేశానికి మురళీ మోహన్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, విజయశాంతి క్లాప్‌ కొట్టారు. ముప్పా వెంకయ్య చౌదరి స్క్రిప్ట్‌ని దర్శకునికి అందించారు. ‘‘భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో రూ΄పొందుతున్న చిత్రమిది. కల్యాణ్‌ రామ్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆయన కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. త్వరలోనే ఇతర నటీనటులు, పూర్తి వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి సంగీతం: బి. అజనీష్‌ లోక్‌నాథ్, కెమెరా: సి. రామ్‌ ప్రసాద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement