![Narappa Movie Shooting Present In Tamilnadu - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/18/Venky.jpg.webp?itok=lp_hAUAp)
‘నారప్ప’ టీమ్ బ్రేక్ లేకుండా ఫుల్‌స్పీడ్‌తో షూటింగ్ చేస్తోంది. నాన్‌స్టాప్‌గా నెల రోజులు తమిళనాడులో షూటింగ్ చేయనున్నారని తెలిసింది. వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్‌హిట్ ‘అసురన్’కి ఇది తెలుగు రీమేక్. కలైపులి యస్ థాను, సురేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియమణి, అమలాపాల్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం తమిళనాడులోని కోవిల్‌పట్టిలో జరుగుతోంది. నెలరోజుల పాటు తమిళనాడు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నారు. ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment