![Venkatesh Saindhav Second Schedule Begins In Vizag - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/14/venky.jpg.webp?itok=hoZKGZMR)
వైజాగ్‌కు మాకాం మార్చింది ‘సైంధవ్’ టీమ్. ‘హిట్’ ఫ్రాంచైజీ చిత్రాల ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసింది చిత్ర యూనిట్.
తాజా షూటింగ్ షెడ్యూల్ గురువారం వైజాగ్‌లో మొదలైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. వెంకటేశ్ కెరీర్‌లో 75వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబరు 22న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment