
కుటుంబ కథా చిత్రాకలు ప్రాధాన్యత ఇచ్చే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తాజాగా విరాట్‌కర్ణ హీరోగా ‘పెద్ద కాపు’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.ప్రగతి శ్రీవాస్తవ ఇందులో హీరోయిన్ కాగా రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ‘పెద్ద కాపు–1’ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.
(ఇదీ చదవండి: Kalpika Ganesh: హీరోయిన్ సీక్రెట్ పెళ్లిపై నటి సంచలన వ్యాఖ్యలు.. ఊహించని ట్విస్ట్)
ఆగస్టు 18న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది. 'ఇది కేవలం జెండా కాదురా.. మన ఆత్మగౌరవం' వంటి డైలాగ్స్ టీజర్‌లో ఉన్నాయి. 'అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇద్దరు వ్యక్తుల ఆధిపత్యం ఉన్న ఓ గ్రామంలో ఒక సాధారణ వ్యక్తి పాలనను ఎలా చేపట్టాడన్నది ఆసక్తికరం. విరాట్‌కర్ణలో మంచి ఇంటెన్సిటీ కనిపిస్తుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు.
(ఇదీ చదవండి: 100 మిలియన్ వ్యూస్ వచ్చిన ఈ పాటను చూశారా?)
Comments
Please login to add a commentAdd a comment