Chiranjeevi: Megastar Going To Malaysia For Waltair Veerayya Movie Shoot | Shruti Haasan - Sakshi
Sakshi News home page

Chiranjeevi Movie Shoot: మలేసియాకు చిరంజీవి పయనం.. 20 రోజుల పాటు

Published Sat, May 28 2022 8:05 AM | Last Updated on Sat, May 28 2022 9:05 AM

Chiranjeevi Going To Malaysia For Valteru Veeraiah Movie Shoot - Sakshi

Chiranjeevi Going To Malaysia For Valteru Veeraiah Movie Shoot: మలేసియా వెళ్లడానికి రెడీ అవుతున్నాడు 'వాల్తేరు వీరయ్య'. ఓ సీక్రెట్‌ ఆపరేషన్‌ కోసమే ఈ ప్రయాణం. టార్గెట్‌ ఎవరు? ప్లాన్‌ ఎలా డిజైన్‌ చేశారు ? అనే అంశాలు తెలియడానికి కాస్త సమయం ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న సినిమా ఇది. 

ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు 30 శాతం పూర్తయింది. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ మలేసియాలో ప్రారంభం కానుందని సమాచారం. జూన్‌ మొదటివారంలో లేదా రెండోవారం ప్రారంభంలో చిరంజీవి, బాబీ అండ్‌ కో మలేసియాకు పయనం అవుతారు. సుమారు 20 రోజులు అక్కడ షూట్‌ ప్లాన్‌ చేశారని తెలిసింది. ఈ సినిమాకు ఈ షూటింగ్‌ కీలకమని సమాచారం. జీకే మోహన్, ఎమ్‌ ప్రవీణ్‌ సహనిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు.      

చదవండి: 👇
నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు: హీరో పవన్‌

అందుకు క్షమాపణలు చెప్పిన కమల్‌ హాసన్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement