రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బయోడీజిల్ వినియోగానికి శ్రీకారం చుట్టింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బర్కత్‌పురా డిపోలో జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ జీవీ ర మణారావు బయోడీజిల్ బస్సును ప్రారంభించారు.
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బయోడీజిల్ వినియోగానికి శ్రీకారం చుట్టింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బర్కత్‌పురా డిపోలో జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ జీవీ ర మణారావు బయోడీజిల్ బస్సును ప్రారంభించారు. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు ఎం.రవీందర్, ఎ.పురుషోత్తమ్ నాయక్, ఆర్.నాగరాజు,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పలు ప్రయోగాల అనంతరం బయోడీజిల్‌ను వినియోగించాలని నిర్ణయించిన టీఎస్‌ఆర్టీసీ 10 శాతం బ్లెండ్ (బి10) వినియోగించేందుకు చర్యలు చేపట్టింది. అంటే 90 లీటర్ల డీజిల్‌కు 10 లీటర్ల మేర బయోడీజిల్‌ను కలిపి వినియోగిస్తారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 100 శాతం బస్సులను బయోడీజిల్ వినియోగం పరిధిలోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొదట 14 డిపోలలో దీనిని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.