గీతం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్(జీఎస్‌ఐబీ)లో వచ్చే విద్యా సంవత్సరానికి (2014-16) ప్రవేశాల ప్రక్రియ ఆరంభమైనట్టు సంస్థ డీన్ అండ్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీకే కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
సాక్షి, హైదరాబాద్: గీతం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్(జీఎస్‌ఐబీ)లో వచ్చే విద్యా సంవత్సరానికి (2014-16) ప్రవేశాల ప్రక్రియ ఆరంభమైనట్టు సంస్థ డీన్ అండ్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీకే కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్), ఎంబీఏ(గ్లోబల్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్), ఎంబీఏ(ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్)ల్లో కోర్సులను అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. వీటికి అదనంగా ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ఎంఫిల్ ప్రోగ్రామ్‌ను కూడా జీఎస్‌ఐబీ నిర్వహిస్తోందన్నారు. పరిశోధన, కన్సల్టెన్సీలతోపాటు వృత్తివిద్యా కోర్సులనూ తమ బీ-స్కూల్ అందజేస్తోందన్నారు. తమ సంస్థ ప్రత్యేకతలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. సీఎస్‌ఆర్-జీహెచ్‌ఆర్‌డీసీ బీ-స్కూల్ సర్వే-2012 ప్రకారం.. ఇంటర్నేషనల్ బిజినెస్‌లో ప్రత్యేక నైపుణ్యాన్ని అందిస్తున్న రెండో ఉత్తమ బీ-స్కూల్‌గా జీఎస్‌ఐబీ నిలిచిందని, ‘బీ-స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’లో ఐదో స్థానం పొందిందని, ఎన్‌హెచ్‌ఆర్‌డీఎన్‌బీ-స్కూల్ సర్వే 2013 ప్రకారం.. 39వ ర్యాంక్ సాధించిందని తెలిపారు. 2014-16 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని, జీఎస్‌ఐబీలో చేరదలిచినవారు ప్రొఫెసర్ సుబ్రమణ్యం(9490886714)ను సంప్రదించాలని సూచిం చారు. మరిన్ని వివరాలకు ఠీఠీఠీ.జటజీఛ.ౌటజను చూడాలని కోరారు.