ఉత్సాహంగా చెస్ ఎంపిక పోటీలు
ఏలూరు రూరల్ : మల్కాపురం ఆశ్రం మెడికల్ కళాశాలలో ఆదివారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాయి చెస్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వైద్య కళాశాల విద్యార్థులు తరలివచ్చారు. పోటీల్లో ప్రతిభచూపిన క్రీడాకారిణులను యూనివర్సిటీ జట్టుకు ఎంపిక చేసినట్టు ఆశ్రం కళాశాల పీడీ శ్రీనివాసరాజు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో పురుషుల జట్టును సోమవారం ఎంపిక చేయనున్నట్టు ప్రకటించారు.