మిస్టర్‌ ‘సి’  న్యూ బిగినింగ్‌ అంటున్న ఉపాసన | newbeginning fr the konidelafamily MrC starts project 2 | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ ‘సి’  న్యూ బిగినింగ్‌ అంటున్న ఉపాసన

Published Wed, Dec 6 2017 11:53 AM | Last Updated on Wed, Dec 6 2017 1:10 PM

newbeginning fr the konidelafamily MrC starts project 2 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ మెగాస్టార్‌  చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ సైరా సెట్స్ పైకి వచ‍్చేసింది. చరణ్‌  ప్రొడక్షన్‌ లో రెండవ  ప్రాజెక్టు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని , చిరంజీవి కుమారుడు, టాలీవుడ్‌ హీరో రామ్‌ చరణ భార్య ఉపాసన ట్విట్టర్‌ ద్వారా తన ఆనందాన్ని ప్రకటించారు. మిస్టర్‌  ‘సి’ కి, కొణిదెల కుటుంబానికి  మావయ్య చిరంజీవి151వ చిత్రం ద్వారా కొత్త ఆరంభం. పవర్‌ఫుల్‌ సైరా నరసింహారెడ్డి పాత్ర, చిత్రం బృందం ఉత్సాహం తప్పకుండా  ఆశ్చర్యంలో ముంచెత్తుతుందంటూ ట్వీట్‌ చేశారు. 

అటు ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్‌  రత్నవేలు దీనికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్లో షేర్‌ చేశారు. సైరా ప్రాజెక్టులో భాగస్వామి కావడం సంతోషంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు. బెస్ట్‌ విషెస్‌ టూ సూరి అంటూ దర్శకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పీరియాడిక‌ల్ మూవీ జర్నీలో  పార్ట్ కావడం, మెగా స్టార్‌  రామ్‌ చరణతో మరోసారి కలిసి పనిచేయడం  సంతోషంగా ఉంద‌ని  ర‌త్న‌వేలు ట్వీట్ చేశారు.

కాగా చిరు కెరియ‌ర్‌లో అత్యంత ప్ర‌తిష్మాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చిత్రం హైద‌రాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. 1840 నాటి కథకి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ భారీ సెట్ వేయ‌గా ఇందులో చిరుతో పాటు ప‌లువురు విదేశీ జూనియ‌ర్ ఆర్టిస్టుల‌పై స‌న్నివేశాల‌ను చిత్రీకరించిన‌ట్టు  తెలుస్తోంది.   స్టైలిష్ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి కొణిదెల ప్రొడక్షన్‌లో రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  కొద్ది రోజుల క్రిత‌మే చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు సినిమా టీంని నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement