Ratnavelu
-
రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది
రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చరణ్- శంకర్ కాంబినేషన్ లో ' గేమ్ ఛేంజర్' మూవీ చాన్నాళ్లుగా షూటింగ్ కొనసాగుతుంది. ఈ చిత్రం గురించి కూడా పెద్దగా అప్డేట్స్ రావడం లేదు. దీంతో ఫ్యాన్స్ కూడా కొంతమేరకు నిరాశ చెందుతున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా (RC16) మూవీ గురించి కీలక సమాచారాన్ని చిత్ర నిర్మాత సంస్ధ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చారు. రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు కెమెరా మెన్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. సౌత్ ఇండియాలో క్రేజీ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న రత్నవేలును ఎంపిక చేశారు. నేడు ఫిబ్రవరి 24న ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మైత్రీ సంస్థ ప్రకటించింది. రత్నవేలు ఇప్పటి వరకు రంగస్థలం,సైరా నరసింహా రెడ్డి,భారతీయుడు 2,ఖైదీ నం. 150, 1: నేనొక్కడినే వంటి చిత్రాలతో పాటు దేవర ప్రాజెక్ట్‌లో ఆయన భాగమయ్యారు. ఇదే సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, జాన్వీ కపూర్ నటిస్తున్నారని టాక్ ఉంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్లో ఉండబోతున్న సంగతి తెలిసిందే. దీనికోసం బుచ్చిబాబు అండ్ టీం ఉత్తరాంధ్ర యాస బాగా మాట్లాడగలిగే నటీనటుల కోసం ఆడిషన్స్ జరిగాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఐతే జోరుగా సాగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ మార్చి రెండో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉండటం వల్ల ఆయన అభిమానులకు కానుకగా ఫస్ట్ లుక్‌ను పరిచయం చేయాలని టీమ్ ప్లాన్ ఉంది. Team #RC16 welcomes the master lensman 🎥 Happy Birthday to the acclaimed cinematographer and the man who delivers stunning visuals, @RathnaveluDop ❤️🔥#RamCharanRevolts Global Star @AlwaysRamCharan @BuchiBabuSana @arrahman @artkolla @vriddhicinemas @SukumarWritings pic.twitter.com/TFXiJ0Te3W — Mythri Movie Makers (@MythriOfficial) February 24, 2024 -
సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట్లో విషాదం
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇంట్లో విషాదం నెలకొంది. రత్నవేలు తల్లి జ్ఞానేశ్వరి రామన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. కాగా సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్లలో రత్నవేలు ఒకరు. చిరంజీవి, రజినీకాంత్ వంటి సూపర్స్టార్లు నటించిన సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఖైదీ నెం150, సైరా, రంగస్థలం, రోబో, సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. (‘వీలు దొరక్కపోతే వీడియోకాల్ అయినా చేస్తా..’) సుకుమార్ దర్శకత్వం వహించే అన్ని సినిమాలకు రత్నవేలే సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు 2కి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇక రత్నవేలు తల్లి చనిపోవడంతో తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు రత్నవేలు కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. MY Mother One who understood my dream&passion without words by just looking at eyes She stood by me Supported me&made sure,I succeed&achieve wht ever I wish in Life! wht I'm today is because of her! My inspiration My almighty My happiness Amma" I miss you" gratitude4evrLUV pic.twitter.com/K0oBxnHMl2 — Rathnavelu ISC (@RathnaveluDop) March 21, 2020 -
‘వీలు దొరక్కపోతే వీడియోకాల్ అయినా చేస్తా..’
సింహాలతో సెల్ఫీ దిగాడు రత్నవేలు! ఒక సింహం ‘నరసింహారెడ్డి’. ఇంకో సింహం సురేందర్‌రెడ్డి. మూడో సింహం కూడా కనిపిస్తుంది. ఆ సింహం.. రత్నవేలే! సినిమాటోగ్రాఫర్. సరేందర్రెడ్డి ‘సైరా’ స్క్రిప్టును.. నరసింహారెడ్డి మెగా గెటప్పును.. రత్నవేలు కెమెరాలోంచి చూడాల్సిందే. మనం చూస్తాం సరే..రెండు వందల ఏళ్ల నాటి కథని ఆయన మైండ్ ఏ లెన్స్‌లతో చూసింది! చదవండి. రత్నవేలుతో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ‘సైరా’లో ఎలా భాగమయ్యారు? ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నప్పుడు ‘సైరా’ సినిమా చేస్తారా? అని రామ్‌చరణ్ అడిగారు. అది వాళ్ల నాన్నగారి డ్రీమ్ ప్రాజెక్ట్. దాని గురించి పది పన్నెండేళ్లుగా చర్చల్లో ఉంది. మీరైతే చాలా ఫాస్ట్‌గా, చాలా క్వాలిటీతో చేస్తారు. మీరు జాయిన్ అయితే బావుంటుంది’ అన్నారు రామ్ చరణ్. నిజానికి ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా కమిట్ అవ్వాలన్నది నా ఫిలాసఫీ. అప్పటికి ‘రంగస్థలం’ ఇంకా పూర్తి కాలేదు. దాంతో ‘ప్రిపరేషన్ కోసం కనీసం రెండు నెలలు సమయం కావాలి’ అని చిరంజీవిగారితో అన్నాను. ఒకవైపు ‘రంగస్థలం’ చేస్తూనే సాయంత్రం ప్యాకప్ చెప్పాక ‘సైరా’ ని ఎలా షూట్ చేయాలా? అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఇందులో కొన్ని వందల మంది మనుషులు, గుర్రాలు, పెద్ద పెద్ద యుద్ధాలు ఉంటాయి. అన్నీ అనుకున్న టైమ్‌కి జరగాలి. అలా జరగాలంటే టెక్నికల్‌గా చాలా బలంగా ఉండాలి. ఇద్దరు యాక్టర్స్‌ని ఫ్రేమ్‌లో పెట్టి షూట్ చేయడం ఈజీ. కానీ ‘సైరా’లో ఎక్కువగా వందల మంది కనిపిస్తారు. అందుకని హోమ్‌వర్క్ చేశాను. ఈ సినిమాలో చాలెంజింగ్ పార్ట్? సినిమా మొత్తం సవాలే. 1840 లలో వాతావరణం ఎలా ఉండేదో మనకు పెద్ద అవగాహన ఉండదు. ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్లగలగాలి. లేకపోతే అంతా వృథా అవుతుంది. ఎలాంటి కెమెరాలు, లెన్స్‌లు వాడారు? గుర్రాలతో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడం చాలా టఫ్. గుర్రాలు 60–70 కి.మీ. వేగంతో పరిగెడతాయి. ఆ సన్నివేశాలను కెమెరాతో బంధించాలంటే అంత వేగంగా కెమెరా పరిగెత్తాలి. సరిగ్గా రాకపోతే మళ్లీ ఆ సన్నివేశం తీయాలంటే రెండు గంటలు శ్రమించాలి. ఒకే టేక్‌లో సీన్‌ని పూర్తిచేయాలి. అందుకే మూవీ ప్రో ఎక్సెల్ మౌంట్ కెమెరా వాడాం. ఈ యుద్ధ సన్నివేశాలు చిత్రీరించాలనుకున్న వారం ముందే ఆ టెక్నాలజీ హాలీవుడ్లో వచ్చింది. ఇంకా హాలీవుడ్లో కూడా సినిమాల్లో అంతగా వాడలేదు. ఇంకా బ్లాక్ కామ్ని ఏటీవి (ఏటీవీ అంటే ఓ వాహనం లాంటిది. వేగంగా సాగే యుద్ధ సన్నివేశాలు తీసేటప్పుడు ఈ వాహనంలో కెమెరాని తీసుకెళతారు. కుదుపులకు కెమెరా షేక్ కాదు)కి ఏర్పాటు చేశాం. కొన్ని ఫైట్ సీన్లు అలా షూట్ చేశాం. అలాగే ‘స్పైడర్ క్యామ్’ వాడాను. ‘స్పైడర్‌మేన్’ సినిమాలకు అది వాడతారు. క్రికెట్ మ్యాచుల్లో కూడా గమనించే ఉంటారు. తాడుకి కట్టిన కెమెరా గ్రౌండ్లో కిందకీ పైకీ తిరుగుతుంటుంది. అది మోషన్ కంట్రోల్ కెమెరా. యుద్ధ సన్నివేశాల్లో రెండుగుర్రాలు తలపడతాయి. అప్పుడు ఈ కెమెరాలు వాటి దగ్గర ఉంటే పరికరాలు ధ్వంసమయ్యే అవకాశం ఎక్కువ. టాప్ యాంగిల్లో నుంచి చూపించడానికి స్పైడర్ క్యామ్ ఉపయోగపడుతుంది. నాలుగు భారీ క్రేన్లను లొకేషన్ చుట్టూ ఏర్పాటు చేశాం. జార్జియాలో షూట్ చేసిన సీన్స్‌కి ఇది ఉపయోగించాం. రష్యా నుంచి ఈ పరికరాన్ని తెప్పించాం. మీరు వాడే వారం ముందే ఆ ‘కెమెరా’ హాలీవుడ్‌కి వచ్చిందన్నారు. మరి.. దాన్ని ఎలా ఉపయోగించాలో ఎలా తెలుసుకున్నారు? ఏదైనా టెక్నాలజీ మార్కెట్లోకి వస్తుంది అని తెలిసినప్పటి నుంచి దాని గురించి స్టడీ చేయడం మొదలుపెడతాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి నాకు ఆ అలవాటు ఉంది. ‘1 నేనొక్కడినే’ చిత్రీకరించే సమయంలో 90 శాతం తెలుగు సినిమాలు ఫిల్మ్లోనే చిత్రీకరిస్తున్నారు. కానీ మేం ఆ సినిమాను డిజిటల్లో షూట్ చేశాం. డిజిటల్లో ఎలా కనిపిస్తామో? అని చాలా మంది సందేహంలో పడ్డారు. మహేశ్‌బాబు చేస్తున్నారు అనేసరికి అందరికీ నమ్మకం వచ్చేసింది. మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది? ‘సైరా’కు చాలా మంది హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేశారు. యాక్షన్‌ని గ్రెగ్ పొవెల్, లీ వైటేకర్ చేశారు. లీ, నేను రజనీకాంత్‌గారి ‘లింగా’ సినిమాకు పని చేశాం. నేను ఉదయం 7 గంటలకు చిత్రీకరణ మొదలుపెట్టాలంటే అందరూ ఉదయం 4 గంటల నుంచే పనుల్లో దిగాలి. అందుకే నేను ‘సన్ సీకర్’ అనే యాప్ వాడతాను. రేపు ఉదయం 6.45కి సూర్యోదయం అవుతుంది. ఆ సమయానికి అందరూ రెడీగా ఉండాలని ముందే చెబుతాను. అలా ప్లాన్ చేసుకునేవాళ్లం. చిత్రదర్శకుడు సురేందర్‌రెడ్డితో మీకిది మొదటి సినిమా ... ఆయనతో మీ సింక్ ఎలా కుదిరింది? ఈ స్క్రిప్ట్ చాలా బావుంది. నేను ఓ సినిమా ఒప్పుకునేటప్పుడు ఫొటోగ్రఫీకి స్కోప్ ఉందా? లేదా అని మాత్రమే చూడను. సుకుమార్‌తో నేను చేసిన ‘రంగస్థలం’ సినిమా తీసుకుంటే మనకు పెద్ద స్కోప్ లేదు కదా? అని వేరే కెమెరామేన్లు అంగీకరించకపోవచ్చు. కానీ లోతుగా వెళ్తే మనకు స్కోప్ దొరుకుతుందని చేశాను. సురేందర్ రెడ్డి మొదటిసారి కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. మా ఇద్దరికీ మంచి సింక్ కుదిరింది. బెస్ట్ టెక్నీషియన్స్ ఉన్నప్పుడు నాకు ఈ సన్నివేశం ఇలానే ఉండాలి అన్నట్టుండదు. ఎవరి స్పేస్ వాళ్లకు ఇచ్చి వాళ్లనుంచి బెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతీ సీన్‌కి ఒకటికి రెండుసార్లు మాట్లాడుకుని ఏదైతే బావుంటుందో దాన్నే చేశాం. మొత్తం 250 రోజులు చిత్రీకరించాం. సినిమా రిలీజ్ దగ్గర పడుతోంది. ఇప్పుడు చెబుతున్నా.. ‘సైరా’ చిరంజీవిగారి కెరీర్లో గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఇందులో రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వెళ్లే సత్తా ఈ సినిమాకు ఉంది టెక్నికల్‌గా, పర్ఫార్మెన్స్ పరంగా అన్నీ సరిగ్గా కుదిరాయి. సాధారణంగా ఎక్కువ చేసి చెప్పడం నాకు నచ్చదు. కానీ ఈ సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. టీజర్ రిలీజ్ అయినప్పుడు ముంబై, చెన్నై నుంచి చాలా ఫోన్లు వచ్చాయి. ఇలాంటి సినిమాను ఒక ఏడాదిలో ఎలా పూర్తి చేశారు? అని అడిగారు. నైట్ ఎఫెక్ట్‌లో ఓ భారీ యుద్ధం ఉందని విన్నాం.. అవును. అది చాలా చాలెంజింగ్ వార్. సాధారణంగా యుద్ధాలు పగలే జరుగుతుంటాయి. బ్రిటీష్ వాళ్లు నరసింహా రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో నియమాలను అతిక్రమించి రాత్రి అటాక్ చేస్తారు. అది చాలా పెద్ద ఫైట్. ఇప్పటి వరకూ రాత్రులు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించిన సినిమాలు తక్కువ. దాన్ని చాలెంజింగ్‌గా తీసుకుని చేశాం. దాదాపు నెల రోజులు నైట్ షూట్ చేశాం పగలు తీసి రాత్రి ఎఫెక్ట్ ఇచ్చే స్కోప్ ఉంది కదా? చేయొచ్చు. అయితే అది హారర్ సినిమాలకు బాగానే ఉంటుంది. ఇది నిజంగా అనిపించాలి. అప్పట్లో కరెంట్ ఉండేది కాదు కదా. రాత్రి పూట కాగడాలు పెట్టుకునేవారు. అది నిజంగా అనిపించాలి. ఈ నైట్ వార్కి గ్రెగ్ పొవెల్ ఫైట్ మాస్టర్. ఓ లొకేషన్ మొత్తం లైటింగ్ చేయాలంటే చాలా లైట్లు పెడతాం. అలా కాకుండా మూన్‌లైట్‌ని సృష్టించాలనుకున్నాను. దానికోసం ఓ సెపరేట్ లైటింగ్ సృష్టించాం. 200 అడుగుల క్రేనులు మూడు ఏర్పాటు చేశాం. లైట్ చుట్టూ సాఫ్ట్బాక్స్ పెట్టి వేలాడదీశాం. దాంతో మూన్లైట్ ఎఫెక్ట్ వచ్చింది. కిందంతా కాగడా వెలుతురులోనే షూట్ చేశాం. చిరంజీవిగారిలాంటి పెద్ద స్టార్ హీరోకు కేవలం కాగడా లైట్స్‌తో షూట్ చేయడం పెద్ద రిస్క్. కలర్ సరిగ్గా ఉండదు, నీడలు వస్తాయి అని ఆలోచిస్తారు. అయితే విజువల్‌గా చాలా అద్భుతంగా వచ్చింది. 25 నుంచి 30 రోజులు కోకాపేట్లో షూట్ చేశాం. ఇంకో విషయం ఏంటంటే అది వానాకాలం. కెమెరా పెట్టి మొత్తం రెడీ చేసుకున్నాక వర్షం పడేది. దానికి తగ్గట్టుగా లైటింగ్ చేశాం. ‘నువ్వు హాలీవుడ్లో ఉండాల్సివాడివి’ అని గ్రెగ్ పొవెల్ అభినందించారు. కేవలం కాగడా వెలుతురుతోనే షూట్ చేయడం అంటే చిరంజీవిగారు అంగీకరించారా? ఎవ్వరికైనా నమ్మకం కలగడం కష్టం. అయితే ఒక్కసారి నమ్మితే ఎవరూ ఆలోచించరు. ఆయన నా ‘రోబో, రంగస్థలం’ సినిమాలు చూశారు. నా ఆలోచనను నమ్మారు. కొన్నిసార్లు ఉన్న రూల్స్‌ని బద్దలు కొడితేనే కొత్త విషయాలు తెలుస్తాయి. కెమెరా ఐఎస్ఓ 800 ఉంటుంది. మేం 2500 ఐఎస్ఓ పెట్టి షూట్ చేశాం. ఈ సినిమాలో ప్రతీ సీన్ ఏదో విధంగా ఇబ్బంది పెట్టడమో చాలెంజ్‌లు విసరడమో చేసింది. ఆ సమస్యకు తగ్గ పరిష్కారం ఆలోచించి చిత్రీకరించుకుంటూ వచ్చాం. ∙‘రోబో’, ‘సైరా’.. ఏది కష్టం అనిపించింది? ‘రోబో’ అప్పుడు అదో ప్రయోగం. ఆ స్థాయిలో వచ్చిన సినిమాలు లేవు. అది క్రియేటివ్‌గా, టెక్నికల్‌గా కష్టంతో కూడుకున్న సినిమా. ‘సైరా’ క్రియేటివ్‌గా, టెక్నికల్‌గా, శారీరకంగా కూడా ఎక్కువ కష్టపడిన సినిమా. ఆ సమయానికి అది పెద్దది. ఇప్పుడు ఇది పెద్దది. మామూలుగా పెద్ద సినిమా అంటే లుక్స్ బయటకు రావడం సహజం. ‘సైరా’ లొకేషన్ నుంచి ఒక్క ఫొటో కూడా లీక్ కాలేదు. ఎలాంటి కేర్ తీసుకు న్నారు? లొకేషన్లో సెల్‌ఫోన్ అనుమతించలేదు. ఒక బాక్స్ ఏర్పాటు చేశాం. మొబైల్ ఫోన్‌ని అందులో డిపాజిట్ చేసి లోపలకి రావాలి. మెయిన్ టెక్నీషియన్స్‌కి మాత్రమే ఫోన్లు అనుమతించారు. ఏకాగ్రత దెబ్బ తింటుందని లొకేషన్లో ఫోన్ వైపు చూడను. లంచ్ సమయంలో ఓసారి, సాయంత్రం ప్యాకప్ తర్వాత మళ్లీ ఓసారి ఫోన్ చూస్తాను. సినిమా గురించి మాట్లాడేప్పుడు హీరో, దర్శకుడు గురించే తప్ప కెమెరా విభాగం గురించి మాట్లాడే వాళ్లు చాలా తక్కువ. అదేమైనా బాధగా ఉంటుందా? అది గతంలో. ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద ప్లస్. కెమెరామేన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ‘రోబో’ సమయంలో ‘యానిమట్రానిక్స్’ అంటే ఎక్కువగా తెలియదు. నేను దాని గురించి చదివి తెలుసుకున్నాను. అయితే మీరన్నట్లు కేవలం, యాక్టర్స్, డైరెక్టర్స్‌ని మాత్రమే అభినందిస్తారు. అప్పుడు టెక్నీషియన్స్‌కి బాధ ఉండటం సహజం. ‘రంగస్థలం’ కోసం రాజమండ్రిలోని మారుమూల ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నాం. అక్కడో కుండలు తయారు చేసే ఆయన నన్ను చూసిన వెంటనే ‘రత్నవేలు గార్రా’ అన్నాడు. సుకుమార్, వాళ్ల తమ్ముడు అందరూ ‘చూశావా.. నిన్ను ఎలా గుర్తుపడుతున్నారో’ అన్నారు. ఫలానా సినిమాకి ఫలానా కెమెరామేన్ అని పేరు తెలియడం కామన్. కానీ మనిషి తెలియడం అంటే.. అది కూడా అంత మారుమూల ప్రాంతంలో అంటే.. అది పెద్ద అచీవ్‌మెంట్‌లా అనిపించింది. ‘కెమెరామేన్‌గా మాకు రత్నవేలే కావాలి’ అని అడిగే హీరోలు ఉన్నారా? ఉన్నారు. నేను అందరితో కలసిపోయే టైప్ కూడా కాదు. పూర్తి శ్రద్ధతో పని చేస్తాను. రిలీజ్‌కి ముందు కూడా కలర్ కరెక్షన్, డీఐ చేస్తూనే ఉంటాం. ఓవర్సీస్ ప్రింట్స్ టైమ్‌కి వెళ్లాయా? లేదా అని చెక్ చేస్తూనే ఉంటాను. ‘సినిమాను జాగ్రత్తగా చేస్తున్నాడు. మనల్ని బాగా చూపిస్తాడు’ అనే నమ్మకం నా హీరోలకు కలుగుతుంది. అందుకే నేను కావాలని అడుగుతుంటారు. అందరూ మీతో చేయాలనుకున్నా అన్నీ చేయడానికి కుదరదు. ‘నో’ చెప్పడం నేర్చుకున్నారా? కొన్ని సార్లు బాధపడతారు. ఓ సినిమా 70 శాతం అయినప్పుడు వేరే సినిమా చేయమని అడుగుతారు. కుదరదు కదా. జనవరి నుంచి డేట్స్ కావాలంటారు. చేస్తున్న సినిమా మార్చి వరకూ జరగొచ్చు. ఎవరూ ఊహించలేం. అందుకే ఒక సినిమా తర్వాత ఒకటి చేస్తుంటాను. ‘రోబో’ తర్వాత నాకు 13 సినిమా ఆఫర్స్ వచ్చాయి. హిందీలో పెద్ద సినిమాకి కూడా అడిగారు. నేను, సుకుమార్ మంచి ఫ్రెండ్స్. తన కోసం ‘1 నేనొక్కడినే’ చేశాను. ఆ సినిమా కోసం నాది 7 నెలల కాంట్రాక్టే. కానీ సినిమా మీద ప్రేమ, సుక్కు మీద ప్రేమ, మహేశ్ అంటే ప్రేమతో రెండేళ్లయినా ఆ సినిమా చేస్తూనే ఉన్నాం. 7 నెలలే కదా అని వేరే సినిమాకి వెళ్లిపోతే అది కరెక్ట్ కూడా కాదు. కెమెరామేన్ అంటే సగం దర్శకుడి కిందే లెక్క. భవిష్యత్తులో దర్శకుడు అవుతారా? 7–8 ఏళ్ల క్రితమే డైరెక్షన్ కోసం అన్నీ సెట్ చేసుకున్నా. సరిగ్గా అప్పుడు రజనీ సార్ ‘రోబో’ కోసం పిలిచారు. సరే.. ‘రంగస్థలం’ తర్వాత చేయాలి అనుకున్నా. చరణ్‌తో ఈ ఆలోచన చెప్పగానే ‘కెమెరామేన్‌గా టాప్‌లో ఉన్నారు. ఇది కంటిన్యూ చేయండి. తర్వాత డైరెక్షన్ చేయొచ్చు’ అన్నారు. అయితే త్వరలోనే నా డైరెక్షన్లో సినిమా మొదలుపెడతా. మొత్తం కథ పూర్తయింది. మీ సినిమాకు మీరే సినిమాటోగ్రఫీ చేస్తారా? మనమే రెండూ చేస్తే ఏకాగ్రత పెట్టలేం అని కెమెరామేన్ నుంచి దర్శకుడిగా మారినవాళ్లు చేయరు. నా స్క్రిప్ట్‌లో మూడ్ ఏంటో నాకు తెలుసు. మళ్లీ ఇంకో అతనికి చెప్పి అదంతా టైమ్ వేస్ట్. సో.. నేనే చేసుకుంటానేమో. మీ అసిస్టెంట్స్ కెమెరామేన్లు అయ్యారా? ఇప్పటివరకూ 11మంది కెమెరామేన్లు అయ్యారు. ఉదాహరణకు తెలుగులో యువరాజ్, తమిళంలో దినేష్, ప్రేమ్‌కుమార్. ఫైనల్లీ మీ డ్రీమ్? హాలీవుడ్లో ఓ సినిమా చేయాలన్నది నా డ్రీమ్. ఐదేళ్ల క్రితం ఓ ఆఫర్, మూడేళ్ళ క్రితం కూడా ఓ సినిమా వచ్చింది. ఒక్క సినిమా చేసి వచ్చేయాలి. నేను హిందీ సినిమా కూడా చేయలేదు. తెలుగు, తమిళంలో చేయడానికి ఇష్టపడతాను. ఇప్పుడు బాలీవుడ్డే సౌత్ సినిమాల్లోకి వస్తుంది కదా. నెలల తరబడి ఫిల్మ్ సెట్లో ఉంటారు. ఫ్యామిలీని మిస్ అవుతుంటారు కదా? ఈ విషయంలో నా భార్యదే క్రెడిట్ అంతా. తన సహకారం లేకుండా ఇన్నేసి రోజులు ఇంటికి దూరంగా సినిమాలు చేయడానికి కుదిరేది కాదు. కొంచెం ఖాళీ దొరికిందంటే చెన్నై వెళ్లిపోతాను. వీలు దొరక్కపోతే వీడియోకాల్ అయినా చేసి భార్య, పిల్లలు, అమ్మతో మాట్లాడతాను. కానీ దగ్గరున్న ఫీల్ వేరు కదా. అందుకే సమ్మర్ హాలీడేస్‌లో ఫ్యామిలీ అందరం కలసి వెకేషన్‌కు వెళ్లిపోతాం. మీకెంత మంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. అబ్బాయికి 17 ఏళ్లు. ప్లస్ టులోకి వచ్చాడు. అమ్మాయికి పదేళ్లు. చాలా అల్లరి చేస్తుంటుంది. మా వాళ్లు చాలా హ్యాపీ. వాళ్ల క్లాస్మేట్స్, టీచర్స్ నా గురించి మాట్లాడినా నాతో చెప్పి ఆనందపడుతుంటారు. వాళ్ల ఆనందం చూసి నాకు భలే సంతోషమేస్తుంది. మా అమ్మ కూడా చాలా గర్వపడుతున్నారు. ‘రంగస్థలం’ సినిమాకు ఈ మధ్యన వచ్చిన అవార్డులు చూసి ఆమె చాలా సంతోషపడ్డారు. మొన్న ‘సాక్షి’ అవార్డు కూడా అందుకున్నాను. 60 ఏళ్లు పైబడిన చిరంజీవిగారు రిస్కీ ఫైట్స్ చేయడం అంటే చిన్న విషయం కాదు. యుద్ధ సన్నివేశాలను ఆయన సౌకర్యం కోసం ప్లాన్ చేశారా? నిజానికి చాలా మంది హీరోలకు గుర్రం నడపడం రాదు. కానీ ఆయన ఈ వయసులో కూడా జోష్‌గా గుర్రం నడిపారు. తాడు కట్టి స్టంట్స్ చేయించడం ఎందుకు? అని ఆలోచించాం. ఆల్రెడీ యాక్షన్ సినిమాలు చేస్తూ చాలా ఏళ్లుగా శరీరం హూనం చేసుకొని ఉన్నారు. అందుకని కష్టపెట్టాలనుకోలేదు. ఆయన మాత్రం ఉత్సాహంగా తాడు కట్టండి నేను చేస్తాను అని ఫైట్ మాస్టర్స్‌తో అన్నప్పుడు ఆశ్చర్యపోయాను. వెంట వెంటనే రెండు దేశభక్తి సినిమాలు చేయడం ఎలా అనిపిస్తోంది? ‘సైరా’, ‘భారతీయుడు 2’.. రెండూ దేనికదే ప్రత్యేకమైనవి. కంటిన్యూస్‌గా దేశభక్తి సినిమాలు చేయడం బాగానే ఉన్నా.. అర్జెంటుగా ఓ మోడ్రన్ సినిమా చేయాలనిపిస్తోంది (నవ్వుతూ). – డి.జి. భవాని -
‘సైరా’లో ఆ సీన్స్.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తుండటంతో ఆలస్యమవుతోంది. చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు మేకర్స్. షూటింగ్‌ను కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ తుది మెరుగులు దిద్దడంలో నిమగ్నమైంది. సైరా డీఐ చాలా బాగా వచ్చిందని, నైట్ ఎఫెక్ట్స్‌లో చిత్రీకరించిన యాక్షన్ సీన్స్.. విజువల్ ఫీస్ట్‌గా ఉంటుందని కెమెరామెన్ రత్నవేలు సోషల్ మీడియాలో తెలిపారు. ఈ పోరాట సన్నివేశాలు.. మెగా ఫ్యాన్స్‌కు రోమాలు నిక్కబొడిచేలా చేస్తాయని అన్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. Syeraa DI shaping out very well !! Just colour graded the most challenging night effect action scene .. a visual feast indeed...Sure Goose bump moments for the Mega fans !! @KonidelaPro pic.twitter.com/RjRRLZvPbX — Rathnavelu ISC (@RathnaveluDop) July 23, 2019 -
‘స్టన్నింగ్‌గా మహేష్ ఆర్మీ లుక్’
‘ఎఫ్2’తో భారీ హిట్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి.. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మహర్షి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను చూపిన మహేష్.. సైనికుడిగా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను జగపతి బాబు పోషించాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆపాత్రలో ప్రకాశ్ రాజ్ నటించబోతోన్నారని తెలుస్తోంది. కశ్మీర్లో చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిందని, ఆర్మీ లుక్‌లో మహేష్ అదిరిపోయాడని కెమెరామెన్ రత్నవేలు ట్వీట్ చేశారు. తనకు ఫెవరేట్ అయిన మహేష్ బాబుతో పనిచేయడం ఎల్లప్పుడూ ఎక్సైట్‌గా ఉంటుందని, అనిల్ రావిపూడితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. రెండో షెడ్యూల్‌ను ఈనెల 26నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. It’s always exciting to work with my favourite @urstrulyMahesh !! Completed the first schedule at Kashmir in style ! MB sir looks stunning in the army look!! Pleasure working with Dir @AnilRavipudi ,@AKentsOfficial and @ThisIsDSP !! pic.twitter.com/nqrs9K0Saj — Rathnavelu ISC (@RathnaveluDop) July 21, 2019 -
చిరు అభిమానులకు గుడ్‌న్యూస్
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త.. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న భారీ చారిత్రాత్మక చిత్రం ‘సైరా’ షూటింగ్ ముగిసింది. ఈ విషయాన్ని ‘సైరా’ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు నెటిజన్లతో పంచుకున్నారు. ఈ సందర్భంగా షూటింగ్‌కు సహకరించిన ‘సైరా’ టీం మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిందన్నారు. మొత్తానికి చిత్రం అద్భుతంగా వచ్చిందన్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా విజయ్ సేతుపతి, నయనతార వంటి బడా స్టార్లు కూడా భాగమయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్ నిర్మాత కాగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కోసం ఫిల్మ్ దునియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖైదీ నంబర్ 150 సినిమాతో భారీ హిట్ కొట్టిన చిరంజీవి సైరాతో మరోసారి రికార్డులు బ్రేక్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. Syeraa shooting completed !!Thanx to each n every member of Team Syeraa for their hard work n cooperation .A memorable journey indeed!! Movie has shaped out extremely well💪💪. Kick started the DI too 😊 @KonidelaPro @DirSurender pic.twitter.com/wjBZM3gZLE — Rathnavelu ISC (@RathnaveluDop) June 24, 2019 -
అప్పుడు సేతు.. ఇప్పుడు రంగస్థలం
‘‘నేను ఏ సినిమాకైనా ముందు పూర్తి కథ వింటాను. ‘రంగస్థలం’కి కూడా సుకుమార్, నేను పలుమార్లు కథ గురించి చర్చించుకున్నాం. ఆయన రాసింది విలేజ్ డ్రామా. ప్రేక్షకుల్ని 1980 కాలంలోకి తీసుకెళ్లాలి. అందంగానూ, తెలుగు కల్చర్ ఉట్టిపడేలా ఉండాలి. అలా చూపించడానికి నా వంతు కృషి చేశాను’’ అని ఛాయాగ్రాహకుడు రత్నవేలు అన్నారు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ నిర్మించిన ఈ సినిమా గత నెల 30న విడుదలైంది. ఈ సినిమాకి కెమెరామేన్‌గా పనిచేసిన రత్నవేలు మీడియాతో మాట్లాడుతూ– ‘‘దర్శకుడికి, కెమెరామేన్‌కు మధ్య మంచి రిలేషన్ ఉంటేనే ‘రంగస్థలం’ లాంటి ఔట్పుట్ సాధ్యం. మా మొదటి సినిమా ‘ఆర్య’ నుంచి నాకు, సుకుమార్‌కు అలాంటి రిలేషన్ ఉంది. సుకుమార్ అన్ని అంశాల్ని పట్టించుకుంటాడు కానీ కెమెరా విషయంలో ఏం మాట్లాడడు. అతనికేం కావాలో అది నేను ఇస్తాననే నమ్మకం. సాధారణంగా సినిమాటోగ్రాఫర్‌కు అంతగా పేరు రాదు. కానీ, ‘రంగస్థలం’ విడుదలైన మొదటి రోజు నుంచి నన్ను ఇండస్ట్రీవారు, క్రిటిక్స్, ప్రేక్షకులు అభినందించారు. యూనిట్ మొత్తం క్రమశిక్షణతో పని చేయడం వల్లే ఈ సక్సెస్ సాధ్యమైంది. ఈ సినిమాకి హార్ట్ అండ్ సోల్ పెట్టి చేశా. నా బిగ్గెస్ట్ హిట్, పేరు తెచ్చిన సినిమా ‘సేతు’. దాని తర్వాత అంతటి సినిమా ‘రంగస్థలం’. ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు’’ అన్నారు. -
మిస్టర్ ‘సి’ న్యూ బిగినింగ్ అంటున్న ఉపాసన
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ సైరా సెట్స్ పైకి వచ్చేసింది. చరణ్ ప్రొడక్షన్ లో రెండవ ప్రాజెక్టు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని , చిరంజీవి కుమారుడు, టాలీవుడ్ హీరో రామ్ చరణ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని ప్రకటించారు. మిస్టర్ ‘సి’ కి, కొణిదెల కుటుంబానికి మావయ్య చిరంజీవి151వ చిత్రం ద్వారా కొత్త ఆరంభం. పవర్ఫుల్ సైరా నరసింహారెడ్డి పాత్ర, చిత్రం బృందం ఉత్సాహం తప్పకుండా ఆశ్చర్యంలో ముంచెత్తుతుందంటూ ట్వీట్ చేశారు. అటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దీనికి సంబంధించిన చిత్రాలను ట్విట్టర్లో షేర్ చేశారు. సైరా ప్రాజెక్టులో భాగస్వామి కావడం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. బెస్ట్ విషెస్ టూ సూరి అంటూ దర్శకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పీరియాడికల్ మూవీ జర్నీలో పార్ట్ కావడం, మెగా స్టార్ రామ్ చరణతో మరోసారి కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని రత్నవేలు ట్వీట్ చేశారు. కాగా చిరు కెరియర్లో అత్యంత ప్రతిష్మాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. 1840 నాటి కథకి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ భారీ సెట్ వేయగా ఇందులో చిరుతో పాటు పలువురు విదేశీ జూనియర్ ఆర్టిస్టులపై సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కొణిదెల ప్రొడక్షన్లో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే చిత్రానికి సంబంధించిన టైటిల్‌తో పాటు సినిమా టీంని నిర్మాణ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించనున్నారు. #newbeginning fr the #konidelafamily MrC ❤️starts project #2 as producer 🎥👌🏻😊. With Mamaya #MegaStarChiranjeevi 151 movie. The power of the character #SyeRaaNarasimhaReddy & the enthusiasm of the team will def mesmerise u. 🎞 #RamCharan — Upasana Kamineni (@upasanakonidela) December 6, 2017 Honoured to be a part of this Epic Journey Sayeraa..once again with Megastar n Ram Charan !! @KonidelaPro Best wishes to Suri n team pic.twitter.com/eOYn6L1nlh — Rathnavelu ISC (@RathnaveluDop) December 5, 2017 -
వీడియో మెసేజ్ పంపిన చరణ్
ఇటీవల కాలంలో రామ్ చరణ్ లో చాలా మార్పు వచ్చింది. సినిమాల ఎంపికతో పాటు ఫ్యాన్స్ ఇండస్ట్రీ ప్రముకులతో ఆయన వ్యవహరించే తీరులో కూడా మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో చాలా ఆవేశంగా కనిపించిన చరణ్ ఇప్పుడు హుందాగా ఉంటున్నాడు. అంతేకాదు తరుచూ అభిమానులను కలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా తన సినిమా సాంకేతిక నిపుణుడి కొడుకు పుట్టిన రోజున వీడియో మెసేజ్ పంపి సర్ ప్రైజ్ చేశాడు చరణ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్. బుధవారం రత్నవేలు కొడుకు పుట్టిన రోజు సందర్భంగా చరణ్ ఓ వీడియో మేసేజ్ ను పంపించాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన రత్నవేలు, చరణ్ కు కృతజ్ఞతలు తెలిపాడు. My dear son Adith wish u a Happy Birthday !! Thank you Charan for your wishes n love @KonidelaPro pic.twitter.com/04Ad1VqJfn — Rathnavelu ISC (@RathnaveluDop) 15 November 2017 -
సై రా అప్ డేట్ : రవివర్మన్ అవుట్
ఖైదీ నంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన నెక్ట్స్ సినిమాను మరింత భారీగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సై రా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెగా తనయుడు రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే టైటిల్ లోగోతో పాటు ప్రధాన పాత్రదారులు, సాంకేతిక నిపుణుల వివరాలను కూడా ప్రకటించేశారు. అయితే కొద్ది రోజులు ఈ సినిమా టెక్నిషియన్స్ ఒక్కరొక్కరుగా తప్పుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో డేట్స్ అడ్జస్ట్ కానీ కారణంగా సంగీత దర్శకుడు రెహమాన్ సై రా నుంచి తప్పుకున్నాడన్న టాక్ వినిపించింది. అయితే ఈ విషయం పై చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ కూడా సై రా నుంచి తప్పుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మరో అడుగు ముందుకేసి రవివర్మన్ స్థానంలో రత్నవేలును తీసుకున్నారన్న ప్రచారం కూడా గట్టిగా వినిపిస్తోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా తెరకెక్కబోయే భారతీయుడు 2 కోసమే రవివర్మన్.. సై రా నుంచి తప్పుకున్నారట. రత్నవేలు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్నరంగస్థలం 1985 సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. అయితే సైరా నరసింహారెడ్డి విషయంలో సినిమాటోగ్రాఫర్ మార్పు నిజమా కాదా తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఆ ఇద్దరినీ పక్కన పెట్టేసిన దర్శకుడు
టాలీవుడ్ ఇండస్ట్రీలో రెగ్యులర్ కమర్షియల్ జానర్‌కు భిన్నంగా సినిమాలు చేసే దర్శకులు చాలా అరుదు. అలాంటి అరుదైన దర్శకుల లిస్ట్ చేసిన ఈ తరం దర్శకుడు సుకుమార్. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు తెరకెక్కించే ఈ లెక్కల మాస్టర్, తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దగ్గరనుంచి ఒకే టీంను కంటిన్యూ చేస్తున్నాడు. తన ప్రతీ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌తో సంగీతం, రత్నవేలుతో సినిమాటోగ్రఫీ చేయిస్తున్నాడు సుక్కు. దేవీ, రత్నవేలులు ఎంత ఎదిగినా, ఎంత బిజీ అయినా సుకుమార్ సినిమా అంటే మాత్రం ఆలోచించకుండా డేట్స్ ఇచ్చేస్తారు. ఆఖరికి సుకుమార్ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిన్న సినిమా, కుమారి 21ఎఫ్ కోసం తమ స్థాయిని కాదని మరి పనిచేశారు. ఈ సినిమాకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా సినిమా సక్సెస్ అయ్యాక లాభాల్లో వాటా తీసుకున్నారు. అంతటి స్నేహం ఈ ముగ్గురిది. అయితే తన నెక్ట్స్ సినిమాకు మాత్రం దేవీ శ్రీ, రత్నవేలులను కాదని వేరే వాళ్లను తీసుకుంటున్నాడు సుకుమార్. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న రెండో సినిమా దర్శకుడుకు సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్లను మారుస్తున్నాడు. చిన్న సినిమాలకు ఇంత బిజీ టెక్నిషియన్లు తీసుకోవటం సరికాదని భావించిన సుక్కు, ఆ సినిమా స్థాయి తగ్గ టెక్నిషియన్స్ ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. ఇక తన దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకు మాత్రం ఈ ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. -
నచ్చకపోతే...వెళ్లిపోతానన్నా!
‘కుమారి 21 ఎఫ్’ పేరుకు చిన్న సినిమా అయినా ప్రతి సన్నివేశం రిచ్‌గా, పెద్ద సినిమాలకు దీటుగా ఉంటుంది’’ అని ప్రముఖ కెమేరామన్ రత్నవేలు చెప్పారు. రాజ్‌తరుణ్, హేబా పటేల్ జంటగా సుకుమార్ నిర్మాతగా మారి కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం ‘కుమారి 21ఎఫ్’. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకుడు. ‘రోబో, 1-నేనొక్కడినే’ లాంటి భారీ చిత్రాలకు పనిచేసిన రత్నవేలు ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు. నేడు రిలీజయ్యే ఈ చిత్రవిశేషాలు ఆయన మాటల్లోనే... సుకుమార్‌తో నాది పదేళ్ల అనుబంధం. ఆయన ఈ కుమారి కథ చెబుతానన్నప్పుడు - ‘నచ్చితే చేస్తా. లేకపోతే చెన్నై వెళిపోతా’నన్నా. కానీ కథ విన్నాక వెంటనే ఓకే చెప్పేశా. కథను నమ్మే సినిమాలు అంగీకరిస్తా గానీ అది చిన్నదా? పెద్దదా అనే తేడా లేదు. ‘రోబో’ చిత్రానికి వర్క్ చేశాక, తమిళంలో ‘హరిదాస్’ అనే లో-బడ్జెట్ చిత్రానికి పనిచేశా. కథానుగుణంగానే ఈ చిత్రానికి రెగ్యులర్ లైటింగ్‌లో 80 శాతం వరకు తగ్గించి పనిచేశా. అందుబాటులో ఉన్న డిజిటల్ లోలైటింగ్ ఫొటోగ్రఫీని ప్రయోగాత్మకంగా వాడాం. క్లయిమాక్స్ సన్నివేశం తక్కువ సంభాషణలతో హీరో హీరోయిన్ల భావోద్వేగాలను బేస్ చేసుకుని ఉంటుంది. ఈ సినిమా కోసం పారితోషికం తీసుకోకుండా ఎందుకు పనిచేశావని చాలామంది అడుగుతున్నారు. 20 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నా. ఇప్పటివరకూ సంపాదించింది చాలు. అందుకే నాకు అలాంటి పట్టింపులు ఉండవు. మంచి సినిమా అయితే చాలు. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’కి పనిచేస్తున్నా. ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయను. ఒక్క సినిమా అయినా నిబద్ధతతో చేయాలనేదే నా అభిప్రాయం. -
‘రోబో’కి ఎంత పేరొచ్చిందో 1కి అంత పేరొచ్చింది
‘నా దృష్టిలో ‘1’ చాలా టఫ్ సినిమా. ఈ తరహా చిత్రం చేస్తున్నప్పుడు దర్శకుడి మూడ్‌ని అనుసరించి, అతనిలా ఆలోచించి అవుట్‌పుట్ ఇవ్వాలి. ‘రోబో’ వేరే జానర్ సినిమా అయినా కూడా దానికెంత పేరొచ్చిందో, ‘1’కీ అంతే పేరొచ్చింది’’ అని ఛాయాగ్రాహకుడు రత్నవేలు చెప్పారు. మహేష్‌బాబు-సుకుమార్ కాంబినేషన్లో రూపొంది ఇటీవల విడుదలైన ‘1’ చిత్రానికి ఆయన సమకూర్చిన ఛాయాగ్రహణం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో ముచ్చటిస్తూ -‘‘దర్శకుడు ఎవరైనా సరే కథ నచ్చితేనే సినిమా చేస్తాను. సుకుమార్ ‘1’ కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి గురయ్యాను. మహేష్ గ్లామరస్ సూపర్‌స్టార్. తన అందం ఏ మాత్రం తగ్గకుండా, అలాగని సినిమా తాలూకు మూడ్ ఏమాత్రం కోల్పోకుండా లైటింగ్ చేశాను. మహేష్, కృతి సనన్‌పై ప్రీ క్లైమాక్స్‌లో సెల్లార్లో తీసిన సీన్‌కి ఎలాంటి లైటింగ్ వాడకుండా మోటార్ బైక్ హెడ్ లైట్ వెలుతురులోనే తీశాం. ఆ సీన్ చేయడం కెమెరామేన్‌గా నాకో పెద్ద సవాల్ అనిపించింది’’ అని తెలిపారు. ప్రస్తుతానికి ఏ సినిమా అంగీకరించలేదని, రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నాక మరో సినిమా గురించి ఆలోచిస్తానని, వచ్చే ఏడాది తన దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని రత్నవేలు చెప్పారు. -
1 నేనొక్కడినే థియేటర్ ట్రైలర్
మహేష్ బాబు '1 నేనొక్కడినే' సినిమా సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రేక్షకులకు నూతన సంవత్సర కానుకగా 1 నేనొక్కడినే థియేటర్ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేసింది. 1... నేనొక్కడినే’ అనే శక్తిమంతమైన టైటిల్‌తో మహేష్‌బాబు హీరోగా నటిస్తే.. ఎంతటి భారీ అంచనాలు ఏర్పడతాయో ఊహించుకోవచ్చు. ఆ అంచనాలను చేరుకునే విధంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ పాటలు స్వరపరిచారు. ఇందులో చిన్నప్పటి మహేష్‌బాబు పాత్రను ఆయన తనయుడు గౌతమ్ పోషించాడు. మహేష్‌బాబు సరసన కృతి సనన్ కథానాయికగా నటించింది.