‘రోబో’కి ఎంత పేరొచ్చిందో 1కి అంత పేరొచ్చింది | Mahesh Babu 1 nenokkadine tuff film, says cameraman rathnavelu | Sakshi
Sakshi News home page

‘రోబో’కి ఎంత పేరొచ్చిందో 1కి అంత పేరొచ్చింది

Published Sat, Jan 18 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

‘రోబో’కి ఎంత పేరొచ్చిందో 1కి అంత పేరొచ్చింది

‘రోబో’కి ఎంత పేరొచ్చిందో 1కి అంత పేరొచ్చింది

‘నా దృష్టిలో ‘1’ చాలా టఫ్ సినిమా. ఈ తరహా చిత్రం చేస్తున్నప్పుడు దర్శకుడి మూడ్‌ని అనుసరించి, అతనిలా ఆలోచించి అవుట్‌పుట్ ఇవ్వాలి. ‘రోబో’ వేరే జానర్ సినిమా అయినా కూడా దానికెంత పేరొచ్చిందో, ‘1’కీ అంతే పేరొచ్చింది’’ అని ఛాయాగ్రాహకుడు రత్నవేలు చెప్పారు. మహేష్‌బాబు-సుకుమార్ కాంబినేషన్‌లో రూపొంది ఇటీవల విడుదలైన ‘1’ చిత్రానికి ఆయన సమకూర్చిన ఛాయాగ్రహణం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో ముచ్చటిస్తూ -‘‘దర్శకుడు ఎవరైనా సరే కథ నచ్చితేనే సినిమా చేస్తాను.
 
  సుకుమార్ ‘1’ కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి గురయ్యాను. మహేష్ గ్లామరస్ సూపర్‌స్టార్. తన అందం ఏ మాత్రం తగ్గకుండా, అలాగని సినిమా తాలూకు మూడ్ ఏమాత్రం కోల్పోకుండా లైటింగ్ చేశాను. మహేష్, కృతి సనన్‌పై ప్రీ క్లైమాక్స్‌లో సెల్లార్‌లో తీసిన సీన్‌కి ఎలాంటి లైటింగ్ వాడకుండా మోటార్ బైక్ హెడ్ లైట్ వెలుతురులోనే తీశాం. ఆ సీన్ చేయడం కెమెరామేన్‌గా నాకో పెద్ద సవాల్ అనిపించింది’’ అని తెలిపారు. ప్రస్తుతానికి ఏ సినిమా అంగీకరించలేదని, రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నాక మరో సినిమా గురించి ఆలోచిస్తానని, వచ్చే ఏడాది తన దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని రత్నవేలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement