మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త.. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న భారీ చారిత్రాత్మక చిత్రం ‘సైరా’ షూటింగ్ ముగిసింది. ఈ విషయాన్ని ‘సైరా’ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు నెటిజన్లతో పంచుకున్నారు. ఈ సందర్భంగా షూటింగ్‌కు సహకరించిన ‘సైరా’ టీం మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిందన్నారు. మొత్తానికి చిత్రం అద్భుతంగా వచ్చిందన్నారు.
చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా విజయ్ సేతుపతి, నయనతార వంటి బడా స్టార్లు కూడా భాగమయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్ నిర్మాత కాగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కోసం ఫిల్మ్ దునియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖైదీ నంబర్ 150 సినిమాతో భారీ హిట్ కొట్టిన చిరంజీవి సైరాతో మరోసారి రికార్డులు బ్రేక్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Syeraa shooting completed !!Thanx to each n every member of Team Syeraa for their hard work n cooperation .A memorable journey indeed!! Movie has shaped out extremely well💪💪. Kick started the DI too 😊 @KonidelaPro @DirSurender pic.twitter.com/wjBZM3gZLE
— Rathnavelu ISC (@RathnaveluDop) June 24, 2019
Comments
Please login to add a commentAdd a comment