![Allu Family Gives Success Party To Sye Raa Unit - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/4/Allu-Family1.jpg.webp?itok=7pTY7BKK)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో సైరా చిత్ర యూనిట్‌కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు గ్రాండ్ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు, సైరా చిత్ర యూనిట్ సభ్యులు, మరికొందరు ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించారు. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో చిరంజీవి, రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్, నిహారిక, అల్లు శిరీష్‌లు, అఖిల్ అక్కినేని, శ్రీకాంత్, దర్శకులు సురేందర్‌రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, సుకుమార్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, జెమిని కిరణ్‌లు పాల్గొన్నారు.
కాగా, తొలి స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన సైరా.. బాక్సాఫీసు వద్ద చిరంజీవి స్టామినా తగ్గలేదని చెప్పుతోంది. దర్శకుడు సురేంద్రరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
అల్లు అరవింద్ ఆఫిస్‌లో ‘సైరా ’ గ్రాండ్ సక్సెస్ పార్టీ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment