రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ నుంచి క్రేజీ అప్డేట్‌ వచ్చేసింది | Crazy Update From Ram Charan And Buchi Babu's RC16 Movie | Sakshi
Sakshi News home page

రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ నుంచి క్రేజీ అప్డేట్‌ వచ్చేసింది

Published Sat, Feb 24 2024 12:38 PM | Last Updated on Sat, Feb 24 2024 12:47 PM

Crazy Update For Ram Charan And Buchi Babu Movie - Sakshi

రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే  చరణ్‌- శంకర్ కాంబినేషన్ లో ' గేమ్ ఛేంజర్' మూవీ చాన్నాళ్లుగా షూటింగ్‌ కొనసాగుతుంది. ఈ చిత్రం గురించి కూడా పెద్దగా అప్డేట్స్‌ రావడం లేదు. దీంతో ఫ్యాన్స్‌ కూడా కొంతమేరకు నిరాశ చెందుతున్నారు.

ఇలాంటి సమయంలో తాజాగా (RC16) మూవీ గురించి కీలక సమాచారాన్ని చిత్ర నిర్మాత సంస్ధ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌ ఇచ్చారు. రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌కు కెమెరా మెన్‌ను ఫిక్స్‌ చేశారు మేకర్స్‌. సౌత్‌ ఇండియాలో  క్రేజీ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న రత్నవేలును ఎంపిక చేశారు.

నేడు ఫిబ్రవరి 24న ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మైత్రీ సంస్థ ప్రకటించింది. రత్నవేలు ఇప్పటి వరకు రంగస్థలం,సైరా నరసింహా రెడ్డి,భారతీయుడు 2,ఖైదీ నం. 150, 1: నేనొక్కడినే    వంటి చిత్రాలతో పాటు దేవర ప్రాజెక్ట్‌లో ఆయన భాగమయ్యారు. ఇదే సినిమాలో కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌, జాన్వీ కపూర్‌ నటిస్తున్నారని టాక్‌ ఉంది.

రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్‌లో ఉండబోతున్న సంగతి తెలిసిందే. దీనికోసం బుచ్చిబాబు అండ్ టీం ఉత్తరాంధ్ర యాస బాగా మాట్లాడగలిగే నటీనటుల కోసం ఆడిషన్స్ జరిగాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఐతే జోరుగా సాగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ మార్చి రెండో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే  ఉండటం వల్ల ఆయన అభిమానులకు కానుకగా ఫస్ట్‌ లుక్‌ను పరిచయం చేయాలని టీమ్‌ ప్లాన్‌ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement