అఫీషియల్: 'కొన్నిసార్లు తిరుగుబాటు కూడా అవసరమే'.. రామ్‌ చరణ్ లేటెస్ట్‌ అప్‌ డేట్ | Ram Charan teams up with Uppena director Buchi Babu Sana | Sakshi
Sakshi News home page

Ram Charan Latest Movie: ఉప్పెన డైరెక్టర్‌తో రామ్‌చరణ్.. మేకర్స్ అఫీషియల్ ట్వీట్

Published Mon, Nov 28 2022 1:50 PM | Last Updated on Mon, Nov 28 2022 1:55 PM

Ram Charan teams up with Uppena director Buchi Babu Sana - Sakshi

మెగాస్టార్‌ తనయుడు రామ్‌ చరణ్‌ తదుపరి చిత్రంపై లేటేస్ట్‌ అప్‌ డేట్‌ వచ్చేసింది. దీనిపై అభిమానుల నిరీక్షణకు  తెరపడింది. వారి సందేహాలకు పుల్‌స్టాప్‌ పెడుతూ ఆర్‌సీ16 మూవీ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేశారు మేకర్స్. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చరణ్‌ ఈ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేస్తూ.. 'కొన్నిసార్లు తిరుగుబాటు కూడా అవసరమవుతుంది' అంటూ హీరో రామ్‌చరణ్‌, దర్శకుడు బుచ్చిబాబును ట్యాగ్‌ చేసింది.

దీనిపై హీరో రామ్ చరణ్‌ రియాక్ట్ అయ్యారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఆసక్తిగా ఉన్నట్లు రీట్వీట్ చేశారు. బుచ్చిబాబు టీమ్‌తో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్నానని రామ్ చరణ్ వెల్లడించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌, వృద్ధి సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం చెర్రీ శంకర్‌ డైరెక్షన్‌లో ఆర్‌సీ15 షూటింగ్‌లో విదేశాల్లో బిజీగా ఉన్నారు. గతంలో 'ఆర్‌సీ 16' గౌతమ్ తిన్ననూరితో ప్రకటించారు. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రం ఉంటుందని టీమ్‌ ప్రకటించింది. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది.

మొదట జూనియర్ ఎన్టీఆర్‌కు ఆఫర్?: ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే.. దర్శకుడు బుచ్చి బాబు మొదట ఈ కథను జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాలనుకున్నట్లు సమాచారం. అయితే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలకు డేట్స్ బ్లాక్ కావడంతో కుదరలేదని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement