
మెగా హీరో వరుణ్‌తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది. శక్తిప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు.
తెలుగులో రామ్ చరణ్ చేతుల మీదుగా ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌తోనే అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. దీంతో మెగా హీరో హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్ర దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సుమారు 40కి పైగా మన సైనికులు మరణించారు. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది.
అయితే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న వరుణ్ తేజ్‌కు అభిమానుల నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. అక్కడే ఉన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్‌డేట్ అడుగన్న ప్లీజ్.. అంటూ వరుణ్ తేజ్‌కు రిక్వెస్ట్ చేశారు. రామ్ చరణ్ అన్నకు ఫోన్ చేసి కనుక్కో అన్నా అని అడిగారు. దీనికి వరుణ్ స్పందిస్తూ.. నిజం చెప్పాలంటే నేను కూడా రోజు అదే అడుగుతున్నా.. ఈ రోజే షూటింగ్ స్టార్ట్ అయిందనుకుంటా.. అక్కడి నుంచి ఈరోజే ఉదయం ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అంటూ ఫ్యాన్స్‌కు సమాధానమిచ్చారు. ఈ రోజును మీకు అన్ని అప్‌డేట్స్ వస్తాయని వరుణ్ తేజ్ అన్నారు.
Mega Prince @IAmVarunTej about #GameChanger UPDATE.#RamCharan #VarunTej #OperationValentine #TeluguFilmNagar pic.twitter.com/12u478l8h6
— Telugu FilmNagar (@telugufilmnagar) February 20, 2024